Telugu News

నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులు

మొలకెత్తని సోయ విత్తనాలు రైతుల రాస్తారోకో

0

నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులు

– మొలకెత్తని సోయ విత్తనాలు రైతుల రాస్తారోకో
ఇచ్చోడ, జూన్ 26(విజయం న్యూస్) :

అమాయక రైతులను ఆసరాగా చేసుకుని వారికి మాయమాటలు చెప్పి నట్టేట ముంచుతున్న ప్రైవేట్ కంపెనీ విత్తన డీలర్లు. వివరాల్లోకి వెళితే.. బజార్హత్నూర్ మండలం కాండ్లీ గ్రామ రైతులు ఇటీవల ఇచ్చోడ మండల కేంద్రంలో ని ప్రైవేట్ విత్తన ఎరువుల దుకాణాలలో కరిష్మా, విక్రాంతి అనే సోయాబిన్ విత్తనాలు కొనుగోలు చేసి విత్తారు. విత్తనాలు వేసి వారం గడుస్తున్నా అవి మొలకెత్తకపోవడంతో తీవ్ర ఆవేదన చెందుతూ ఆదివారం ఇచ్చోడ మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ. తమకు మోసం చేసిన కంపెనీ డీలర్ల పై పీడీ యాక్ట్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తమను ప్రభుత్వం ఆదుకొని న్యాయం జరిగేలా చూడాలని కోరారు. తప్పును కప్పి పుచ్చుకునేందుకు వర్షం పడకముందే విత్తనం వేశారని అందుకే సోయా విత్తనాలను మొలవలేదు అని అధికారులు చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ధర్నాలో రైతులు పాల్గొన్నారు.

ఇది కూడా ఒపెన్ చూసి చదవండి : –నిల్వ ఉన్న నీటిని తొలగించిన అధికారులు