Telugu News

జీవితం పై విరక్తి చెందిన యువకుడు ఏం చేశాడంటే.?

కుటుంబాన్ని వదిలేసిన యువకుడు..? శోకసముద్రంలో తల్లిదండ్రులు

0

జీవితం పై విరక్తి చెందిన యువకుడు ఏం చేసుకున్నాడంటే

== కుటుంబాన్ని వదిలేసి..?

== శోకసముద్రంలో తల్లిదండ్రులు

(రిపోర్టర్-కైలాస్)

ఇచ్చోడ/ సిరికొండ ఆగస్టు 23 (విజయం న్యూస్) :

మద్యానికి బానిసైన యువకుడు తన జీవితాన్ని భారంగా భావించాడు. బతకలేక కుటుంబానికి దూరమైయ్యాడు..  జీవితం పై విరక్తి చెందిన ఆయన ఎవరు చేయలేని సాహసం చేసి అందనంత దూరంగా వెళ్లాడు.. కుటుంబాన్ని శోక సముద్రంలోకి తీసుకెళ్లాడు.. ఈ సంఘటన సిరికొండలో జరిగింది.  పూర్తి వివరాల్లోకి వెళ్తే

ఇది కూడా చదవండి: మాజీ మంత్రి తుమ్మల సంచనల వ్యాఖ్యలు

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం సిరికొండ మండలంలోని చిన్న గోధుమల్లే గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై పి. నరేష్ తెలిపిన వివరాల ప్రకారం చిన్న గోదుమల్లె గ్రామనికి చెందిన జుగ్నాక్ జుగాదిరావ్ (23) మద్యానిక బానిసై అయ్యాడు.సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లో మద్యం మత్తులో పురుగుల మందు తాగి లోపల నుండి డోర్స్ పెట్టుకొని ఉన్నాడు,మృతిని తల్లి వచ్చి డోర్స్ ఎంత్త కొట్టిన తీయకపోవడంతో గ్రామస్తులు, స్థానికులు ఇంటి పైన ఎక్కి పై కప్పు తీసి చూడగా మృతుడు వాంతులు చేసుకుంటూ కన్పించార్,వెంటనే ఇంట్లోకి దిగి డోర్స్ ఓపెన్ చేసి ప్రథమ చికిత్స అందించి వెంటనే 108 వాహనంలో జిల్లా కేంద్రంలోని రిమ్స్ తరలించారు, అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.మృతిని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పి. నరేష్ తెలిపారు.

allso read- తమ్మినేని కృష్ణయ్య హత్యలో సూత్రదారులేవరు..? పాత్రదారులేవ్వరు..?