Telugu News

తామర పురుగుతో తంటాలు. 

👉 వైరస్ తో  మోడుబారూతున్న మిర్చి మొక్కలు

0

తామర పురుగుతో తంటాలు 

👉 వైరస్ తో  మోడుబారూతున్న మిర్చి మొక్కలు

👉 నలుపు రంగు తామర పురుగుల వ్యాప్తి 

👉తెగుళ్ల వ్యాప్తి తొ అతలకుతలం

👉ఏ మందు కొట్టిన ప్రయోజనం లేకుండా పోతుంది అని వాపోతున్న మిర్చి రైతులు

👉 పత్తాలేని  వ్యవసాయ శాఖ అధికారులు  

👉ప్రభుత్వమే ఆదుకోవాలి అంటున్న రైతులు

 

(బూర్గంపహాడ్ -విజయం న్యూస్ );-

ఈ ఏడాది రైతులు మిరప సాగు పై ఎన్నో ఆశలు పెట్టుకున్నరు. తొలకరి  తరుణం ముందునుంచి మిరప సాగు చేసేందుకు రైతులు నిర్ణయించుకున్నారు. గత 2,3ఏళ్లుగా మార్కెట్లో మిర్చి పంటకు మంచి ధర లభించడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. దీంతో చిన్న, సన్నకారి రైతులు సైతం మిరప పంట సాగు వైపు మొగ్గు చూపారు. దీంతో గతంలో కంటే ఎక్కువ విస్తీర్ణంలో మండలంలో మిరప సాగు జరుగుతుంది. అధికారిక గణాంకాల ప్రకారం ఎకరాలు విస్తీర్ణంలో మిరప సాగు జరిగినట్లు తెలుపుతున్న అనా అధికారంగా  విస్తీర్ణం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. ఎక్కువ మంది రైతులు అధిక ధర వెచ్చించి మేలైన వంగడపు విత్తనాల ఎంపిక చేసుకొని కొనుగోలు చేశారు. స్వయంగా నారుమడులు ఏర్పాటు చేసుకొని పంట సాగు చేశారు. మరికొందరు నర్సరీలలో  అధిక ధర చెల్లించి మొక్కలను కొనుగోలు చేశారు.

సాగు తొలిదశలో భారీ వర్షాలు కురిశాయి. ఆ తర్వాత మొక్కలు ఏ దిశలో కూడా భారీ వర్షాలు కురవడంతో వాతావరణం అనుకూలించకనో.?, విత్తనాలు తేడా కారణంగానో,? పలు రకాల తెగులు వ్యాప్తి చెందుతున్నాయి. సాగుచేసిన నేల వ్యవధిలోనే అంటే మొక్క ఎదుగుతున్న దశలోనే తెగులు సోకి మొక్కలు ఎండి పోవడం, లేదా పోత రాలిపోవడం జరుగుతుంది. వీటి నివారణ కోసం ఎన్ని రసాయన మందులు వాడిన ఉపయోగం లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. పంటను కాపాడుకునేందుకు ఎంత పోరాటం చేసిన ఫలితం దక్కకపోవడంతో రైతులు  ఆవేదన చెందుతున్నారు. కొన్ని మిరప తోటలో ట్రాక్టర్ తో చెడగొడుతున్నారు. మరికొన్ని తోటల్లో పశువులను మేపుతున్న దృశ్యాలు కనబడుతున్నాయి. దూకుడు మొదలుకొని విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, కూలి ఖర్చులు  కలుపుకొని ఎకరానికి 50 వేలకు పైగా పెట్టుబడి పెట్టి అయినా కాలం కలిసి రాక, విత్తనాల లోపంతో, వాతావరణం అనుకూలించక రైతు కష్టం వృధా అవుతుంది. మిరప సాగు పెంచుకున్న రైతుల ఆశలు మధ్యలోనే ఆవిరి అయి పోతున్నాయి.

వేగవంతంగా ఉత్పత్తి.. వ్యాప్తి

ఎన్ని రకాల మందులు పిచికారి చేసిన తామర పురుగు వ్యాప్తి  మాత్రం అదుపులోకి రావడం లేదు. రాష్ట్రంలో ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం వరంగల్ మహబూబాబాద్ భూపాల్ పల్లి ములుగు హనుమకొండ సూర్యాపేట జిల్లాలో అత్యధిక విస్తీర్ణంలో మిర్చి తోటలు తామర పురుగు ఉత్పత్తికి దెబ్బతిన్నాయి. దక్షిణాసియా దేశాలకు చెందిన. అమెరికాలోని ఫ్లోరిడా హవాయి ప్రాంతం నుంచి మన దేశంలోకి ప్రవేశించిన తామర పురుగు వేగవంతంగా వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది మందులు పిచికారి చేసిన సమయంలో పువ్వుల్లో కి ఆకుకింది భాగం, నేల పొలాల్లోకి వెళ్లి పురుగు మందు ప్రభావం తగ్గిన తర్వాత యధావిధిగా మొక్కల పైకి చేరుతుందని తెలిపారు. తామర పురుగు తోపాటు వేరు పురుగు, తెల్ల దోమ, పచ్చపురుగు, రబ్బర్ పురుగు ప్రభావంతో ఖమ్మం జిల్లాలోని మిర్చి తోటలో దెబ్బతిన్నట్లు ఉద్యానవన శాఖ గుర్తించింది  తామర పురుగు నివారణకు ఉదయం సాయంత్రం వేళల్లో వెల్ రైతులందరూ ఏకకాలంలో కాలంలో చేస్తే చాలా వరకు ప్రయోజనం ఉంటుందనట్టున్నారు.

 రైతులను మోసం చేస్తున్న ఫెర్టిలైజర్స్ షాపు యజమానులు:- 

తెగుళ్ళు ఆశించడం తో రైతులు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి అనేక రకాల మందులు పిచికారి చేసిన ప్రకృతి కోపం ముందు అన్నదాత  తలవంచక తప్పడం లేదు. నకిలీ పురుగు మందులు, నకిలీ విత్తనాలు అన్నదాతలు అప్పుల ఊబిలో చుట్టుకునే పోయేలా చేసినాయి. కొందరు వ్యాపారులు లాభార్జన ధ్యేయం గా నకిలీ పురుగు మందులు అంటగట్టి రైతులను నిలువునా ముంచారు. బయో క్రిమిసంహారక మందులతోపాటు ఫెర్టిలైజర్స్  అండ్ ఫెస్టిసైడ్స్  వ్యాపారులు బ్రాండెడ్ పేరుతో నకిలీ మందులను తయారు చేసి గుట్టు చప్పుడు కాకుండా జిల్లా రైతులకు అంటగట్టడం తో   రైతులు నిలువునా  మునిగిపోతున్నారు.

అధికారుల పర్యవేక్షణ కరువు :- 

వ్యవసాయ మార్కెట్ లో మిర్చి పంటకు ధర అధికంగా ఉండడంతో జిల్లా రైతులు ఈ ఏడాది ఎక్కువ మొత్తంలో పంట సాగు చేశారు. కానీ ఈసారి వారి ఆశలు అడియాశలు అయ్యాయి. తెగుళ్ళు అదుపులోకి రాకపోవడంతో వందలాది ఎకరాల్లో రైతులు పంటలను స్వచ్ఛందంగా పీకేస్తున్నారు. పంట సంరక్షణ చర్యల విషయంలో అవగాహన కల్పించాల్సిన వ్యవసాయ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కేవలం కార్యాలయాల కే పరిమితమై మొక్కుబడిగా రైతు వేడుకల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

also read :-డప్పు వాయించిన మంత్రి అజయ్