Telugu News

కాంగ్రెస్ పార్టీలోకి ఎడవల్లి కృష్ణ

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చేరికల కమిటీ ఛైర్మన్:జగ్గారెడ్డి

0

కాంగ్రెస్ పార్టీలోకి ఎడవల్లి కృష్ణ

== కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చేరికల కమిటీ ఛైర్మన్:జగ్గారెడ్డి

(కొత్తగూడెం -విజయం న్యూస్)

కొత్తగూడెం నియోజకవర్గం సీనియర్ నాయకులు యడవల్లి కృష్ణ సొంత గూటికి చేరారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్ గాంధీభవన్ లో చేరికల కమిటీ ఛైర్మన్ జగ్గారెడ్డి అధ్వర్యంలో ఎడవల్లి కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరారు‌.

ఇది కూడా చదవండి:- కాంగ్రెస్ లో చేరిన సంభాని

ఆయనతో పాటు రాయల శాంతయ్య, చావా వీరయ్య చౌదరి,బొమ్మిడి మల్లికార్జున్,పల్లపు వెంకటేశ్వర్లు,సిరంగి శ్రీనివాస్, చింత నాగరాజు, చారి,పెంకి శ్రీను,కత్తెర హనుమంతరావు,శెట్టిపల్లి వెంకట్, గద్దల రమేష్,వేమారెడ్డి,శ్రీను, ఇస్లావత్ రాజు,తదితరులు కాంగ్రెస్ లో చేరగా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కండువా కప్పి స్వాగతం పలికారు. రాహుల్ గాంధీని ప్రధాని కుర్చీలో కుర్చోబెట్టడమే లక్ష్యంగా పని చేయాలని, ఖమ్మం ఎంపీ అభ్యర్థి మంచి మెజారిటీ వచ్చే విధంగా పనిచేయాలని కోరారు.