Telugu News

కార్పొరేట్ కబంద హస్తాల్లో విద్యారంగం.

 విద్యార్థి, నిరుద్యోగ ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే

0

కార్పొరేట్ కబంద హస్తాల్లో విద్యారంగం
 విద్యార్థి, నిరుద్యోగ ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే
(ఖమ్మంవిజయం న్యూస్) :-

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే విద్యారంగ సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చే ఏడు సంవత్సరాలు అవుతున్నా విద్యారంగం విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించకుండా, కార్పొరేట్ సంస్థలకు విద్యారంగాన్ని దారాదత్తం చేస్తుందని aisf రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావి శివరామకృష్ణ ప్రభుత్వాన్ని విమర్శించారు.సోమవారం aisf 26 వ జిల్లా మహాసభలులో భాగంగా sr&bgnr కళాశాల నుండి సిటీ సెంట్రల్ పంక్షన్ హల్ వరకు భారీ ప్రదర్శన, కవాతు నిర్వహించారు. అనంతరం సిటీ పంక్షన్ హల్ లో విద్యార్థులతో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో శివరామకృష్ణ మాట్లాడుతూ విద్యారంగాన్ని. విస్మరించిన ప్రభుత్వానికి పతనం తప్పదని గత ప్రభుత్వాలకు పట్టిన గతే కేసీఆర్ ప్రభుత్వానికి పడుతుందని హెచ్చరించారు.

all so read :- ఖమ్మంలో చలి పంజా

.విద్యారంగంలో ప్రవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తూ ప్రభుత్వ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్రలకు కేంద్రం తెరలేపిందని, పేదలు, మద్యతరగతి వర్గాల పిల్లలకు విద్యను దూరంచేసే విదంగా కేంద్రం నిర్ణయాలు చేస్తోందన్నారు. కేంద్రం తీసుకువస్తున్న 2020 విద్యా విదానం ప్రభుత్వ విద్యను కనుమరుగు చేసేందుకేనని అయన అన్నారు, విద్యార్ధులను ఆలోచింపచేసే లౌకిక, ప్రజాస్వామ్యం వంటి పదాలను తొలగించి విద్యా కాషాయీకరణ కు కేంద్రం కుట్ర చేస్తోందన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ మాట్లాడుతూ . పేద, మధ్య తరగతి వర్గాలకు భారంగా మారిన ఇంధన, నిత్యావసర ధరలు అదుపుచేయడంలో పాలకులు విఫలం చెందారన్నారు. కార్మిక చట్టాలను సవరిస్తూ హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థి, యువజనులను మోసం చేస్తూ పాలన సాగిస్తోందని, పోరాడి సాధించుకున్న తెలంగాణాలో నిరుద్యోగం రాజ్యమేలుతోందన్నారు.

రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వ విద్యాసంస్థలను మూసివేస్తూ మరోవైపు కార్పోరేట్ విద్యాసంస్థల ఏర్పాటుకు విచ్చల విడిగా అనుమతులిస్తూ పేద విద్యార్ధులను విద్యకు దూరంచేసే కుట్రలు చేస్తోందన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యావ్యతిరేక విధానాలను మానుకొని ప్రభుత్వ విద్యారంగం బలోపేతానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్ంఘం రాష్ట్ర నాయకులు జమ్ముల జితేందర్రెడ్డి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్దినేని కర్ణ కుమార్, మాజీ నాయకులు ఇంద్రసేన, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మడుపల్లి లక్ష్మణ్ ఇటుకల రామకృష్ణ. జిల్లా సహాయ కార్యదర్శిలు. జై సుభాని లక్ష్మణ్. జిల్లా కార్యవర్గ సభ్యులు T .కౌశిక్ ధర్మవరపు యువరాజ్. ఆసిఫ్ పవన్ కళ్యాణ్ చందు గోపి పి రవి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

also read :-ప్రజలకు తెలంగాణ సర్కార్ షాకింగ్ న్యూస్.