మహిళలపై రాందేవ్ బాబా వ్యాఖ్యలను ఖండిస్తున్నం
== అఖిల పక్ష మహిళా సంఘాల ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దగ్ధం
ఖమ్మం , నవంబర్ 26 (విజయంన్యూస్)
ఐద్వా, ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యు,. పి ఓ డబ్ల్యు ఖమ్మం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో రాందేవ్ బాబా వ్యాఖ్యలను ఖండిస్తూ ఖమ్మం ఐద్వా ఆఫీస్ నుంచి సరిత క్లినిక్ సెంటర్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు .అనంతరం ఐద్వాజిల్లా అధ్యక్షులు బండి పద్మ అధ్యక్షతన జరిగిన జనరల్ బాడీ లో రాష్ట్ర నాయకు రాలు బుగ్గ వీటి సరళ జిల్లాకార్యదర్శి మాచర్ల భారతి ,ఎన్ ఎఫ్ ఐ డబల్యూ రాష్ట్ర నాయకురాలు పోటు కళావతి, వారు పి ఓ డబ్ల్యు జిల్లా కార్యదర్శి పి ఝాన్సీమాట్లాడుతూ సమాజంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వారు ఆవేదన చెందారు రాందేవ్ బాబా మహిళలు పట్ల చేసిన వ్యాఖ్యలు మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయని మహిళలు బట్టలు వేసుకోకుండా అందంగా ఉంటారని వ్యాఖ్యానించడాన్ని వారు ఖండించారు.
ఇది కూడా చదవండి: విషాదంలో విజేత.. కృతిక మనోదైర్యానికి లాల్ సలామ్
ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ప్రవచనాలు వల్లించే వీరు మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడడం వాళ్ళ వెక్కిలి చేష్టలకు పరాకాష్టన్నారు .దినదిన అభివృద్ధి చెందుతున్న సాంకేతిక యుగంలో కూడా ఇలాంటి దుర్మార్గులు మహిళల పట్ల వ్యాఖ్యానించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు .ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు . ఇటీవల గరికపాటి ఇప్పుడు రాందేవ్ బాబా మహిళల పట్ల దురుసుగా మాట్లాడారని వారు ఖండించారు.
ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా నాయకురాలు మెరుగు రమణ ఎండి మెహరున్నీసా బేగం ,, p. నాగ సులోచన ఎన్ ఎఫ్ ఐ డబల్యూ తాటి నిర్మల, పి ఓ డబ్ల్యు ఆవుల మంగతాయి, ఐద్వా నాయకురాలు వంగూరి రమ,భాగం అజిత, p రమ్య ,అమరావతి, తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: గుండాల ఎంపీటీసీ ఎస్ కె సంధాని మృతి