Telugu News

రేవంత్ రెడ్డి ఇంటి పై దాడి ని ఖండించిన కాంగ్రెస్ నాయకులు

** అరెస్టు చేసిన పోలీసులు

0
రేవంత్ రెడ్డి ఇంటి పై దాడి ని ఖండించిన కాంగ్రెస్ నాయకులు
** అరెస్టు చేసిన పోలీసులు 
(ఇల్లందు టౌన్ – విజయం న్యూస్)
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు  ఏనుముల రేవంత్ రెడ్డి   ఇంటిపై టిఆర్ఎస్  నాయకులు  చేసిన దాడిని ఖండిస్తూ భద్రాద్రి కొత్తగూడెంజిల్లా  కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఆదేశాల మేరకు  ఇల్లందు నియోజకవర్గం ఇల్లందు పట్టణ,మండల లో ధర్నా చేస్తున్న కాంగ్రెస్ నాయకులను ఇల్లందు పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఇల్లందు పట్టణ మండల అధ్యక్షులు దొడ్డ డానియల్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సవాల్ స్వీకరించని టీఆర్ఎస్ నాయకులు, మంత్రి కేటీఆర్, చాతగానీ వారు చేసే పనులు చేస్తున్నారని ఆరోపించారు. దమ్ముంటే రేవంత్ రెడ్డి సవాల్ ను స్వీకరించాలని డిమాండ్ చేశారు.  పులిసైదులు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఎట్టి హరికృష్ణ, పట్టణ ప్రధాన కార్యదర్శి జఫార్,జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు కల్తి వెంకటేశ్వర్లు,ఈశ్వర్ గౌడ్,దనసరి రాజు,వెంకటనరాయణ,పునేం మధు,వేణు,మైనారిటీ సెల్ పకృదిన్,కాయం రమేష్,కిషోర్, సాదిమియా,కాంగ్రెస్ నాయకులు అరెస్టు అన్నారు.