Telugu News

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

పురుగుల మందు తాగి ఆత్మహత్య

0

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

(ఇల్లందు టౌన్- విజయం న్యూస్)

కుటుంబ కలహాలతో మానసిక ఇబ్బందులకు గురైన ఓ వ్యక్తి సోమవారం పురుగులు మందు తాగి  ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇల్లందు మండలంలో చోటు చేసుకుంది.

ఇల్లందు మండలం మామిడి గూడెం పంచాయతీ ఎద్దలపల్లి గ్రామానికి చెందిన యదలపల్లి కిరణ్ (35) ఇంట్లో ఇద్దర భార్యల విషయంలో తరుచు గొడవలు జరుగుతున్నాయి.. ఈ క్రమంలో మనస్థాపానికి గురైన ఆ వ్యక్తి ఇంటివద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేశాడు.. స్థానికులు చూసి ఆ వ్యక్తిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం వైద్యశాలకు తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందాడు. ట్రాక్టర్ నడుపుతూ జీవనం సాగించే మృతునికి ఇద్దరు భార్యలు నలుగురు పిల్లలు ఉన్నారు.