వృద్ధ దంపతులపై గొడ్డలితో దాడి
(హాజిపూర్ విజయం న్యూస్) :-
-మండలంలోని గుడిపేట్ ఆర్&ఆర్ కాలనీలో దారుణం చోటుచేసుకుంది.మేకలు ఇంట్లోకి వస్తున్నాయి అని నెపంతో పాతకక్షలును మనుసు లో పెట్టుకొని వృద్ధ దంపతులపై గొడ్డలితో దాడి చేసాడు.దంపతులకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్ళితే గుడిపేట్ ఆర్ &ఆర్ కాలనీకి చెందిన గోళ్ల బక్కయ్య,(65) గోళ్ల బాణమ్మ (55) అను వృద్ధ దంపతులు మేకలు కాసుకుంటు జీవనం కొనసాగిస్తున్నారు.
also read :-ప్రబాస్ మరో సినిమాలో..?
మేకలను మేత కోసం తీసుకవెళ్లే సమయంలో వీరి ఇంటి సమీపంలోని చాల్లురి దుర్గయ్య పాత కక్షలను మనసులో పెట్టుకొని శనివారం ఉదయం ఇంట్లోకి మేకలు వస్తున్నాయనే నెపంతో మేకలను మేతకు తీసావెళ్తున్న వారి వెనకాలే గొడ్డలితో వెళ్లి వృద్ధ దంపతుల పై విచక్షణ రహితంగా గొడ్డలితో దాడి చేశాడు. అది గమనించిన స్థానికులు వెంటనే గాయపడిన వృద్దులను ఆసుపత్రికి తరలించారు.