ఐదు రాష్ట్రాలకు మోగిన ఎన్నికల నగారా
== షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారి రాజీవ్ కుమార్
== తెలంగాణ, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, రాజస్తాన్ తో పాటు మీజోరం రాష్ట్రాల్లో ఎన్నికలకు షెడ్యూల్
(న్యూఢిల్లీ-విజయంన్యూస్)
ఐదు రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగింది.. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసింది. సోమవారం న్యూఢిల్లీలోని ఎన్నికల సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సంఘం అధికారి రాజీవ్ కుమార్ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేశారు. తెలంగాణ, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, రాజస్తాన్ తో పాటు మీజోరం రాష్ట్రాల్లో ఎన్నికలను నిర్వహిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఐదు రాష్ట్రాల్లో 679అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. అంతేకాకుండా 16.14 కోట్ల మంది ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుకోనున్నారు. 60లక్షల మంది కొత్త ఓటర్లు ఓటు హక్కును కల్గి ఉన్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా, రాజస్తాన్, మిజోరం 40, మద్యప్రదేశ్ 230, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లోని నియోజకవర్గాలకు ఎన్నికలను నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం అధికారి ప్రకటించారు. ఈ రోజు నుంచి ఎన్నికల కోడ్ అమలవుతుందని, ఎలాంటి ప్రభుత్వ పథకాల కార్యక్రమాలను నిర్వహించరాదని తెలిపారు.
ఇది కూడా చదవండి: కొనసాగుతున్న ఈ అభివృద్ది అగకుడదు :మంత్రి పువ్వాడ