Telugu News

విజయభేరితో  ఎన్నికల కదనభేరి : కాంగ్రెస్

ఈనెల 17న విజయభేరి సభకు భారీగా తరలిరండి

0

విజయభేరితో  ఎన్నికల కదనబేరి : కాంగ్రెస్

== ఈనెల 17న విజయభేరి సభకు భారీగా తరలిరండి

== పాలేరు నియోజకవర్గం నుంచి 500 వాహనాలతో ర్యాలీ

== 18న గ్యారంటీ స్కీమ్ కార్డుల పంపిణి

== విలేకర్ల సమావేశంలో పాలేరు నియోజకవర్గ ఇంచార్జ్ మల్లయ్య

(కూసుమంచి-విజయంన్యూస్)

హైదరాబాద్ లో జరిగే విజయభేరి బహిరంగ సభతో ఎన్నికల కధనబేరి ప్రారంభమవుతుందని పీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు, పాలేరు నియోజకవర్గ ఇంచార్జ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య తెలిపారు. ఈ నెల 17వ తారీఖున హైదరాబాద్ సిడబ్ల్యూసి ఆధ్వర్యంలో తుక్కుగూడా లో జరగనున్న కాంగ్రెస్ విజయభేరి సభకు  పాలేరు నియోజకవర్గం నుండి భారీగా తరలి రావాలని కార్యక్రమ ఇంచార్జ్ పీసీసీ జనరల్ సెక్రటరీ కొండేటి.మల్లయ్య తెలిపారు.తోలుత కూసుమంచి మండలంలోని మల్లాయిగూడెం గ్రామంలో 18వ తారీఖున సిడబ్ల్యూసి ఇంచార్జ్ మల్లయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండా గద్దెల ప్రారంభించి జెండా ఆవిష్కరించునున్నట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి: తుమ్మల ఇంటికి ఠాక్రే

మల్లాయగూడెం గ్రామంలో కార్యక్రమం నిర్వహించే స్థలాన్ని కొండేటి. లింగయ్య స్థానికనాయకులుసందర్శించారు.అనంతరం కాంగ్రెస్ పార్టి ప్రవేశ పెట్టిన ముఖ్య పథకాలు హామీలకు సంబంధించిన గ్యారంటీ స్కీం కార్డులను మల్లాయగూడెం గ్రామంలో ఇంటిఇంటికి పంచనున్నట్లు తెలిపారు.మొన్న కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే తరహాలో గ్యారంటీ కార్డులను పంచినట్లు తెలిపారు. ఈ గ్యారంటీ కార్డు పొందిన కుటుంబం రేపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కార్డులు పొందిన లబ్ధిదారులు ఆ కార్డు చూపించి తమకు ఇచ్చిన హామీలను పొందవచ్చని తెలిపారు.నియోజకవర్గ వ్యాప్తంగా ముఖ్య నాయకులు,పాలేరు నియోజకవర్గానికి పోటీలో ఉన్న అభ్యర్థులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారని తెలిపారు. అనంతరం కూసుమంచి మండల కేంద్రంలో జిల్లా మైనారిటీ నాయకుడు ఎండి హాఫిజుద్దీన్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు రాయల.నాగేశ్వరరావు,రామిరెడ్డి.చరణ్ రెడ్డిలు మాట్లాడుతూ 17వ తారీఖున జరిగే విజయబేరి సభ తెలంగాణ రాష్ట్రంలో జరగడం కాంగ్రెస్ పార్టి అదృష్టమని, ఈ సభకు 10లక్షల మంది తరలివెళ్తే 100స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని అన్నారు.

ఇది కూడా చదవండి: హరీష్ రావు ఇది సిద్దిపేట కాదు ఖమ్మం: భట్టి విక్రమార్క

ఈ సభతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని తెలిపారు.ఈ సభ అనంతరం 18వ తారీఖున 119నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంచార్జ్ ను నియమిస్తున్నట్లు ఆరోజు నుండి అన్ని నియోజకవర్గాల్లో పార్టి కార్యక్రమాలు చురుకుగా జరుగుతాయాని తెలిపారు. సభకు వచ్చే ప్రతి కార్యకర్తకు,నాయకులకు రవాణా, భోజన సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు, స్వంత వాహనాలు ఉన్న వారు వారి వాహనాల్లో రావాలని భారీగా నియోజకవర్గంనుండికార్యకర్తలు,నాయకులు తరలి రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో  పాలేరు ఇంచార్జ్ కొండేటి.మల్లయ్య, పాలేరు అభ్యర్ధిత్వం కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రాయల.నాగేశ్వరరావు, రాంరెడ్డి.చరణ్ రెడ్డి,పీసీసీ అధికారప్రతినిధి కొరివి.వెంకటరత్నం, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొడ్డు.బొందయ్య, జిల్లా మైనారిటీనాయకుడు ఎండి.హఫీజుద్దీన్, మండల పార్టి అధ్యక్షుడు మట్టే.గురవయ్య, తదితరులు పాల్గోన్నారు.