18 ఏళ్లు పైబడిన బాలికలందరికి ఎలక్ట్రిక్ స్కూటర్లు: సంభాని
హాత్ సే హత్ జోడో యాత్రలో మాజీమంత్రి సంభాని
18 ఏళ్లు పైబడిన బాలికలందరికి ఎలక్ట్రిక్ స్కూటర్లు: సంభాని
== కాంగ్రెస్ మాటిస్తే అమలు చేసి తీరుతాం
== హాత్ సే హత్ జోడో యాత్రలో మాజీమంత్రి సంభాని
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
సత్తుపల్లి నియోజకవర్గంలో 52వ రోజు హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా బుధవారం పెనుబల్లి మండలంలో పాత కారాయిగూడెం గ్రామంలో జరిగిన ఈకార్యక్రమంలో ప్రజలు బ్రహ్మరథం పట్టగా మాజీమంత్రి, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు సంభాని చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేసి కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ది సాధ్యమని తెలుపుతూ రాహుల్ గాంధీ సందేశాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై రూపొందించిన చార్జిషీట్‌ని ప్రజలకు అందిస్తూ ఈ క్రింది విధంగా మాట్లాడారు.
ఇది కొణిజర్లలో ఘోర ప్రమాదం..ముగ్గురు మృతి
ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఎన్నికల సమయంలో దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని, దళితులకు మూడు ఎకరాల భూమి పంపిణీ చేస్తామని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చి పదేళ్లు కావస్తున్న ఇప్పటకీ అమలు చేయకుండా ప్రజలను దగా చేసింది బిఆర్ఎస్ పార్టీ… దళితుబంధు పేరుతో దళితుల ఓట్లకోసం రూ.10లక్షల ప్రకటించి అరకొరగా ఇచ్చి దళితులను మోసం చేస్తున్నారన్నారు. నిరుద్యోగ భృతి, రైతులకు పంట రుణాలమాఫీ వంటి హామీలు ఇచ్చి నెరవేర్చలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే..రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ ప్రతి ఇంటికి, ఒకేసారి రైతు రుణమాఫీ రూ. 2 లక్షలు. వైద్యం కోసం కుటుంబానికి సంవత్సరానికి ఉచితముగా 5 లక్షలు. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేస్తామన్నారు. మొదటి ఏడాదిలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ, నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే వరకు ప్రతీ నెలా రూ. 4000 నిరుద్యోగ భృతి చెల్లింపు చేస్తామన్నారు.
ఇది కూడా చదవండి: అనుచరుడుని పరామర్శించిన సంభాని
18 ఏళ్లు పైబడిన బాలికలకు ఎలక్ట్రిక్ స్కూటర్లను అందజేస్తామన్నారు. పెనుబల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెలికాని రాజబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు బైరెడ్డి మనోహర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు వంకాయలపాటి వెంకటేశ్వరరావు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రామిశెట్టి మనోహర్ నాయుడు, వేంసూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కాసార చంద్రశేఖర్ రెడ్డి, మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు వడ్లమూడి కృష్ణయ్య, నున్నా సురేష్, గంపా సోమయ్య, పాలెం బాబయ్య, వంకాయలపాటి మురళి, కాంతారావు, మరేశ్వరావు,గద్దె శ్రీను, కర్రి సత్యనారాయణ, చిలుకబత్తుల చెన్నారావు, వెలగపూడి వసంతరావు, జిల్లెళ్ల నరసింహస్వామి, ఇజ్జగాని నాగేశ్వరరావు, బెల్లంకొండ సీతారాములు, గోగినేని రమేష్, మేకతొట్టి కాంతయ్య, శ్రీరంగనిలయం రవి, దేవేంద్ర బాబు, మామిళ్ళ వెంకటేశ్వర్లు, రామకృష్ణ రెడ్డి ఇతర నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.