Telugu News

విద్యుధాఘాతంతో రైతు మృతి..

కూసుమంచి మండలం సోమ్లా తండా గ్రామంలో సంఘటన

0

విద్యుధాఘాతంతో రైతు మృతి..
కూసుమంచి మండలం సోమ్లా తండా గ్రామంలో సంఘటన
*నీళ్లు పెట్టేందుకు వెళ్లి కరెంట్ షాక్ తగలడంతో అక్కడిక్కడే చనిపోయిన మాలోతు గోభియ
(కూసుమంచి- విజయంన్యూస్)
విద్యుధాఘాతంతో మరో రైతు బలైయ్యాడు. పంట సాగు చేస్తున్న రైతు పంట పోలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లిన రైతు మోటర్ ఆన్ చేస్తుండగా కరెంట్ షాక్ రావడంతో అక్కడిక్కడే మతి చెందాడు. ఈ సంఘటన గురువారం రాత్రి కూసుమంచి మండలంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే కూసుమించి మండలంలోని భగత్ వీడు పంచాయతీ శివారు సోమ్లాతండాకు చెందిన మాలోతు గోబియా తండ్రి పంతులు(36) వ్యవసాయం సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

also read :-ఘనంగా గడిపల్లి కవిత జన్మదిన వేడుకలు….

యితే ఎప్పటిలాగే గురువారం తన పంట పోలానికి నీళ్లు పెట్టాలని పాలేరు వాగులో ఉన్న మోటర్ ఆన్ చేసేందుకు వెళ్లిన రైతు గోబియా మోటర్ పట్టుకోగానే కరెంట్ రావడంతో విద్యాధాఘాతంతో అక్కడిక్కడే చనిపోయాడు. దీంతో స్థానికులు వచ్చి చూడగా అప్పటికే చనిపోయి ఉన్నాడు. కాగా సోమ్లాతండాలో విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న కూసుమంచి ఎస్ ఐ నందీఫ్ సంఘటన స్థలానికి చేరుకుని మతదేహానికి శవపరీక్ష నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గోబియాకు భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.