Telugu News

ఇల్లందు వైస్ చైర్మన్ ఇంటిపై రాళ్ళ దాడి   

ఇంటి అద్దాలు పగలకొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు

0

ఇల్లందు వైస్ చైర్మన్ ఇంటిపై రాళ్ళ దాడి   

== ఇంటి అద్దాలు పగలకొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు

== సంచలనంగా మారిన రాళ్ళదాడి

== వైస్ చైర్మన్ ను కలిసి వివరాలు తెలుసుకున్న జడ్పీచైర్మన్

ఇల్లందు,ఖమ్మం, నవంబర్ 8(విజయంన్యూస్)

రెండు రోజులుగా రిక్కి వేశారు.. సమయం చూశారు.. తెల్లవారుజామున సమాయాన్ని వెంచుకుని వీధిలైట్లన్నింటిని బంద్ చేశారు.. ఇంటి గేటును ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు.. అకస్మీకంగా ఇంటిపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు.. ఆ రాళ్ల సౌండ్ తో వైస్ చైర్మన్ సయ్యద్ జానీపాషా, కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.. ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి.. ఆ తరువాత చూస్తే రాళ్లదాడి జరిగినట్లుగా గుర్తించిన వైస్ చైర్మన్ పోలీసులకు సమాచారం అందించారు.

 

ALLSO READ- ధాన్యం కొనరు కానీ ఎమ్మెల్యేలను కొంటరా?:మంత్రి పువ్వాడ

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం వైస్ చైర్మన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ధర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే భద్రాద్రికొత్తగూడెం జిల్లా, ఇల్లందు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ సయ్యద్ జానీ పాషా ఇంటిపై కొందరు దుండగులు రాళ్లదాడి చేశారు. ఆయన ఇంటిపై మంగళవారం తెల్లవారుజామున సుమారుగా 2 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వీధిలైట్లన్నింటిని తీసేసి ఇంటి గేటుపై దాడి చేశారు. అనంతరం ఇంటిపై రాళ్లదాడి చేశారు. దీంతో ఇంటికి ఉన్న అద్దాలు ధ్వంసమైయ్యాయి. దీంతో వారు ఒక్కసారిగా ఉలిక్కిపడి పెద్ద ఎత్తున కేకలు వేసినట్లు తెలుస్తోంది. దీంతో స్థానికులు లేవడంతో ఆ దుండగులు పరారైయ్యారు. దీంతో తన ఇంటికి దాడి చేయడం జరిగిందని వెంటనే 100 కు సమాచారం  ఇవ్వగా పోలీసులు ఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. అనంతరం ఇల్లందు సీఐ బాణోతు రాజు, ఎస్ఐ పరిశీలించారు. సంఘటనపై వైస్ చైర్మన్ ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ALLSO READ- మునుగోడులో ‘కారు’ జోరు

పలు సీసీ పుటేజీలను పరిశీలించే పనిలో నిమగ్నమైయ్యారు. కచ్చితంగా నింధితులను పట్టుకుని తీరతామని పోలీసులు చెబుతున్నారు.

==నా పార్టీ వాళ్లే పై కుట్రపన్ని దాడులు చేస్తున్నారు: వైస్ చైర్మన్

నా పార్టీ వాళ్లే నాపై కుట్రపన్ని, రాజకీయంగా ఎదుగుదలను ఓర్వలేక నాపై దాడులు చేస్తున్నారని వైస్ చైర్మన్ సయ్యద్ జానీపాషా ఆరోపించారు. గత కొద్ది రోజులుగా ముగ్గురు వ్యక్తులు నాపై దాడి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని, పలుమార్లు రెక్కి నిర్వహించిన

ట్లు నాకు తెలిసిందన్నారు. నాకు ప్రాణహాని ఉందని తన సన్నిహితులతో రామ్ లాల్ చెప్పడం జరిగిందని ఆరోపించారు. అంతేకాకుండా గత కొంత కాలంగా ఆర్ అండ్ ఆర్ కాలనీలో తన స్థలం ప్రక్కన గల భూమి విషయంలో కోడెం సమ్మయ్య అనే వ్యక్తి కోర్టులో కేసులు వేయడం,అధికారులు ఫిర్యాదు చేయడం జరిగిందన్నానరు. తన సొంత పార్టీ నేత సిరిమల్ల రాజు సైతం తనను ఇబ్బందులకు గురి చేస్తూ తన కదలికలను ఎప్పటికప్పుడు రెక్కీ నిర్వహించడం జరుగుతుందని ఆరోపించారు.తన ఇంటిపై దాడి జరిగిన విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. తన ఇంటిపై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

== అస్వస్థతకు గురైన జానీ పాషా                                        ALLSO READ- నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ క్లీన్ స్వీఫ్

రాళ్లదాడి తరువాత ఒకింత భయాందోళనకు గురైన వైస్ చైర్మన్ సయ్యద్ పాషా అస్వస్తతకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో ఆయన్ను పట్టణంలోని మోతిలాల్ వైద్యశాలకు తరలించగా, అక్కడ వైద్యులు చికిత్సను అందిస్తున్నారు.  అనంతరం అస్వస్థతకు గురైన వైస్ చైర్మన్ సయ్యద్ జానీ పాషాను జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య,జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్ పరామర్శించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.