ఎమ్మెల్సీగా కవిత ప్రమాణం
== ప్రమాణస్వీకారం చేయించిన ప్రోటెం ఛైర్మన్
(హైదరాబాద్-విజయంన్యూస్)
నిజామాబాద్, కామారెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా విజయంసాధించిన కల్వకుంట్ల కవిత బుధవారం ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం ఉదయం శాసనమండలి చైర్మన్ చాంబర్‌లో ప్రొటెం చైర్మన్ జాఫ్రీ కవితతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు కవిత ధన్యవాదాలు తెలియజేశారు. కవితతోపాటు కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కూడా ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు. నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్సీలు కవిత, దామోదర్ రెడ్డిలకు మంత్రి మండలి రూల్స్ బుక్స్, ఐడి కార్డు అందజేశారు.
also read ;-సమంతకు బంపర్ ఆఫర్!
అనంతరం పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో హోం శాఖ మంత్రి మహమ్మద్ అలీ, మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీలు బీబీ పాటిల్, కే ఆర్ సురేష్ రెడ్డి,రైతు బంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు గణెళిష్ గుప్తా, షకీల్ మహ్మద్, సంజయ్ కుమార్, ఎమ్మెల్సీలు గంగాధర్ గౌడ్, ఫారూఖ్ హుస్సేన్, బానుప్రసాదరావు, ఎమ్.ఎస్ ప్రభాకర్ రావు, ఎల్.రమణ, అసెంబ్లీ కార్యదర్శి డా.నర్సింహా చార్యులు, మాజీ ఎమ్మెల్సీలు శ్రీనివాసరెడ్డి, నారదాసు లక్ష్మణ్, జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.