Telugu News

మానవత్వం చాటుకున్న ఎమ్మెల్సీ బాలసాని

చర్ల మండలంలో రోడ్డు ప్రమాదం

0

మానవత్వం చాటుకున్న ఎమ్మెల్సీ బాలసాని..

చర్ల మండలంలో రోడ్డు ప్రమాదం

**నలుగురికీ గాయాలు..

* ప్రమాదాన్ని చూసి క్షతగాత్రులను ఆసుపత్రికి పంపించిన ఎమెల్సీ బాలసాని.
(చర్ల -విజయం న్యూస్)
ఆలుబకా వెంకటాపురం రహదారి వీరభద్రవరం కుక్కతోరి మలుపు వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. మోటర్ సైకిల్ ను ఆటో ఢీ కొట్టగా నలుగురు గాయపడ్డారు. దీంతో అదే సమయంలో అటుగా వెళ్తున్న
ఎంఎల్సీ బాలసాని లక్ష్మీనారాయణ వాహనంను అపి క్షతగాత్రులను పరామర్శించి వేరే ఆటోల వెంకటాపురం లోని ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. అందులో సీరియస్ గా ఉన్న ఇద్దరిని అంబులెన్స్ ద్వారా మెరుగైన వైద్యం కోసం ములుగు తరలించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు పోన్ ద్వారా సూచించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..