Telugu News

ఖాళీ జాగా…వేసేయ్ పాగా…!

?ప్రభుత్వ భూముల కు రక్షణేది..!

0

ఖాళీ జాగా…వేసేయ్ పాగా…!

?ప్రభుత్వ భూముల కు రక్షణేది..!
? ల్యాండ్ కన్వర్షన్ లేకుండానే ప్లాట్లుగా మార్చి అమ్మేందుకు యత్నం
?చోద్యం చూస్తూన్న అధికారులు ? భూమి కబ్జా, పుంపు హౌస్ కూలిచ్చి, సామగ్రి మాయం చేసిన రియల్టర్
? పంప్ హౌస్ లు కాల్ చేసి ప్లాట్లుగా మార్చేస్తున్నా రియల్టర్
? గిరిజన చట్టాలకు విరుద్ధంగా సాగుతున్న భూముల విక్రయాలు విక్రయాలు
?1 / 70 చట్టం.. బడాబాబుల చట్టమా..?!

( బూర్గంపహాడ్ -విజయం న్యూస్ )

అసలే ఏజెన్సీ ప్రాంతం ఆపై భూముల క్రయ విక్రయాలు నిషేధం..అయినప్పటికీ కొంతమంది గిరిజనేతరలు గిరిజన చట్టాలను తుంగలో తొక్కుతున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రియల్ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. అది ప్రభుత్వం అటవీ అయినా.. భూములు ఏమైనా ఆక్రమించడం, వాటిలో అనధికారిక వెంచర్ల వేయడం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వెన్నతో పెట్టిన విద్య గా మారింది.

గతంలో 1 లక్ష 50 వేలు కాజేసిన పంచాయతీ కార్మికుడు పై కేసు నమోదు చేసిన అధికారి.. మరి ఏకంగా 40 సెంట్లు ల్యాండ్ ను కబ్జా చేసిన రియల్టర్ పై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అనే ప్రశ్న మిలియన్ డాలర్ ప్రశ్న గానే మిగిలి పోతుంది .

also read :-ఆందోళన వద్దు.. కరోనా ని ధైర్యంగా ఎదుర్కొందాం

బూర్గంపహాడ్ మండలం లోని సారపాక లో రోజురోజుకు పెరుగుతున్న జనాభా వారి అవసరాల నిమిత్తం కోసం జనం ఎగబడుతున్న రు.అది ప్రభుత్వభూమి భూమా..సొంత భూమా..ఆలోచన చేయకుండా కొనుగోలు చేస్తూ ఇబ్బందులకు అవుతున్న వైనం.భద్రాద్రి కొత్త గూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ భూమి ఎంతో ఉంది ఇది అధికారిక లెక్కల లో మాత్రమే ప్రస్తుతం కనిపించే పరిస్థితి నెలకొంది.బడాబాబులు గద్దల్లా వాలిపోతూ ప్రభుత్వ భూములను కబ్జా చేస్తూ ఇష్టానుసారంగా అమ్మకాలు చేస్తూ కోట్లకు పడగలెత్తుతారు.కానీ ఇన్ని జరుగుతున్న అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడని పరిస్థితి. సామాన్యుడు ఇల్లు కోసం వెతుక్కోవలసిన పరిస్థితి ప్రస్తుతం మండలంలో నెలకొంది.లక్ష్మీ పురం,బంజరు ప్రాంతాల్లో చెరువుల కబ్జా జరిగినట్లు అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇటీవలే ప్రభుత్వ అధికారులు రైతు వేదిక, ప్రకృతి వనంలకు పలువురు నుండి భూమి ని తీసుకొని పక్కా భవనాలు, పార్కు లు నిర్మాణము చేపట్టారని ఆరోపణలు ఉన్నాయి. ఇక పోతే పారిశ్రామిక ప్రాంతమైన సారపాక మేజర్ పంచాయతీ గ్రామంలో ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 5, సర్వే నెంబర్ 264,263 లో పలు సర్వే నెంబర్లు లో ప్రభుత్వ భూమి ఉంది కానీ అది కొందరు పెద్దలు కబ్జా చేయడం సహజం గా మారింది.ఒక అధికార పార్టీకి చెందిన పెద్ద మనిషి ఏకంగా కొల్లు చెరువునె కబ్జా చేసి రహదారి నిర్మాణం చేసిన తమకు పట్టనట్టు వున్నా అధికారులు.కోయగూడెం,తాళ్ల గుమ్మూరు గ్రామ పంచాయతీ లలో ప్రభుత్వ భూములు కబ్జాలో ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో లీజు పేరుతో భూ కబ్జా జరుగుతుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇటీవల సారపాక పెట్రోల్ బంక్ ఎదురుగా ఉండవలసిన గ్రామపంచాయతీ భూమి,పక్క భవనం, సుమారు 40 సెంట్ల ప్రభుత్వ స్థలం స్వాహా చేసి ప్లాట్లుగా చేస్తున్నట్లు పలువురు ఆరోపణలు చేశారు.

also read :-కియా కారు ను మార్కెట్ లోకి విడుదల చేసిన మంత్రి పువ్వాడ.

సదరు కబ్జాదారుల కు నోటీసులు ఇచ్చి మామా అనిపించారు పంచాయతీ అధికారులు. ఆ ప్రాంతంలో గత 40 సంవత్సరాల క్రితం గ్రామ ప్రజల త్రాగునీరు సరఫరా నిమిత్తం ఆనాటి ఇరవెండి గ్రామపంచాయతీకి ఆ ప్రాంతంలో పంప్ హౌస్ నిర్మాణం చేపట్టి అందుకు సంబంధించిన భవనం, మోటర్లు ఏర్పాటు చేసి పైపు లైన్ల ద్వారా తాగునీరు సరఫరా జరిగేది.ఇది అందరికీ తెలిసిన నగ్న సత్యం. అలాంటి సారపాక పంపు హౌస్ ను కూడా కబ్జా చేసి దర్జాగా మోటర్, పైపులైన్లు, బిల్డింగ్ కు సంబంధించిన తలుపులు, కిటికీలు, ఇతర సామాగ్రిని అమ్ముకొని సొమ్ము చేసుకున్న వారిపై చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. 40 సెంట్ల స్థలం అమ్మకానికి పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.ప్రభుత్వ భవనం తొలిగించాలంటే ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాలి.కానీ అర్ధరాత్రి సమయంలో జేసీబీ తో పంచాయతీ పుంపు హౌస్ నేలమట్టం చేసి సామగ్రి ని దొంగిలించి న వారిపై ఇప్పటి వరకు కేసు నమోదు చేయకపోవడం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పబ్లిక్ గా కనిపించే పుంపు హౌస్ నేడు కనుమరుగు చేశారు.

ముడుపులు మత్తులో పంచాయతీ అధికారులు జోగుతున్నారా…!అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో గ్రామపంచాయతీలో లక్షా యాభై వేలు గ్రామపంచాయతీ ఫిట్టర్ తన చేతి వాటాన్ని చూపించడంతో అతనిపై అప్పటి ఈఓ కేసు పెట్టి జైలుకు పంపించిన అటువంటి దాఖలాలు ఉన్నాయి .కానీ ప్రభుత్వ భూమి అందులోని మోటర్లు ,తలుపులు, కిటికీలు ,పైపులు పలు సామాన్లతో పాటు ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై ప్రేమ చూపిస్తూ అధికారులు తమ నిర్లక్ష్యాన్ని వెళ్లబోసుకున్నారు. అంటే మతలబు ఏమిటి అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. వారిపై కఠిన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అర్థం కాని ప్రశ్న. సారపాక ప్రధాన రహదారి ప్రాంతంలో ఉన్నటువంటి ,యూనాని సేవా వైద్యశాల, భవనం దానికి సంబంధించిన భూమి ప్రస్తుతం కనుమరుగయింది.

also read :-బూర్గంపహాడ్ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు పోడియం ముత్యాలమ్మ ఆగ్రహం

అధికారులు దానిని పట్టించుకున్న దాఖలాలు లేవు.ప్రస్తుతం ఆ భవనం నిరుపయోగంగా మారి ఆక్రమణదారులకు అడ్డా గా మారింది .ఇలా ఎక్కడికక్కడ ప్రభుత్వ భూములు కబ్జా చేస్తూ పలువురి పెద్దల,అధికార పార్టీ అండదండలతో ఈ కబ్జాలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధాన రహదారి ప్రాంతంలో ఉన్నటువంటి పుంపు హౌస్ మాయం చేసిన వారిపై చర్యలు చేపట్టారా,ఇలా ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా కబ్జాదారులు గద్దల్లా వాలిపోతున్నారు. వాటిని ప్లాట్లుగా తయారు చేసుకుంటూ అమ్మకాలు సాగిస్తున్నారు. అసలు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి 1/70 యాక్ట్ ఉందా అనే అనుమానం వ్యక్తమవుతోంది. ఏజెన్సీ ప్రాంతంలో అమ్మకాలు కొనుగోలు చేయకూడదన్న నియమాలు ఉన్న వాటిని తుంగలో తొక్కి కబ్జాదారులు వారికి అనుకూలంగా మలచుకుంటూ అధికారులను ఒత్తిడులకు గురి చేస్తూ ముడుపులు అందజేస్తూ ప్లాటు రూపంలో అమ్మకాలు చేస్తూన్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.అధికారుల వైఫల్యం పూర్తి స్థాయిలో ఉన్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ భూములు కాపాడాల్సిన పంచాయతీ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఆ దిశగా చర్యలు తీసుకోక పోవడం శోచనీయం. అధికారులు ఇకనైనా జోక్యం చేసుకుని ప్రభుత్వభూమి బూర్గంపాడు మండలంలో ఏ ఏ ప్రాంతాల్లో ఎన్ని ఉన్నాయి? పూర్తి వివరాలు సేకరించి వాటిని రక్షించి ప్రభుత్వ అవసరాలకు గాని పేదవారికి గాని వాటిని వినియోగించాలని సామాన్యుడు కోరుతున్నారు. సామాన్యుడి కోరిక నెరవేరుతుందా లేదా…? అధికారులు కబ్జాదారుల పై కొరడా ఝులిపిస్తారా లేదా…?ప్రభుత్వ భూములుకు రక్షణ కల్పిస్తారా..లేదా?పుంపు హౌస్ స్థలం ఉందా లేదా…? వారి పై చర్యలు ఉంటాయా.?ఉండవా.?పంచాయతీ భూమి ఉందా ?లేదా.?..వేచి చూడాలి .