టిడిపి రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా ఏన్కూరు ఎంపీపీ
== అభినందనలు తెలిపిన మండలం టీడీపీ నేతలు
ఏన్కూరు, జూన్ 8(విజయం న్యూస్):
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా ఏన్కూరు ఎంపీపీ ఆరేం వరలక్ష్మి నియమితులయ్యారు. ఈ మేరకు ఆవిభాగం రాష్ట్ర అధ్యక్షురాలు భవనం షకీలా రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ప్రకటించారు. నియామక ఉత్తర్వులను జారీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును వారు కలిశారు. పార్టీ పటిష్టతకు కృషి చేయాలని కోరారు. గత ఎన్నికల్లో రాష్ట్రంలోనే టిడిపి నుంచి గెలిచిన ఏకైక ఎంపీపీ కావడం విశేషం.
ఇది కూడా చదవండి:- ఏసీబీకి చిక్కిన ఏన్కూరు తాసిల్దార్