Telugu News

ఏసీబీకి చిక్కిన ఏన్కూరు తాసిల్దార్

రెవెన్యూ యంత్రాంగంలో కలకలం

0

ఏసీబీకి చిక్కిన ఏన్కూరు తాసిల్దార్

** రెవెన్యూ యంత్రాంగంలో కలకలం

ఏన్కూరు. జూన్ 8 (విజయం న్యూస్)

ఖమ్మం జిల్లా ఏన్కూరు తాసిల్దార్ కార్యాలయంలో గురువారం సాయంత్రం అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. ఓ రైతు నుంచి మూడు వేల రూపాయల లంచం తీసుకుంటూ తాసిల్దార్ ఖాసిం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు . ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ రావు విలేకరులకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఇది కూడా చదవండి:- రాజుపేట బజార్ సర్పంచ్ మృతి పట్ల ఎమ్మెల్యే తీవ్ర దిగ్భ్రాంతి

ఏన్కూరు మండలం బద్రు తండాకు చెందిన బానోతు బుజ్జి పేరు మీద నాచారం రెవిన్యూ లో సర్వే నెంబర్ 136 లో 2-07 కుంటల భూమి ఉంది. అట్టి భూమిలో 24 కుంటల భూమిని కొడుకు రామకృష్ణ వారసత్వంగా పట్టా చేయించేందుకు మే 23న తాసిల్దార్ ను రామకృష్ణ ఆశ్రయించాడు. 3 వేలు లంచం ఇవ్వాల్సిందిగా తాసిల్దార్ డిమాండ్ చేయడంతో గురువారం సాయంత్రం రామకృష్ణ తాసిల్దార్ 3వేలు ఇవ్వగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఖమ్మంలో తాసిల్దార్ ఇంటిపై కూడా దాడులు చేయనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఏన్కూరు తాసిల్దార్ కార్యాలయం అవినీతి నిలయంగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి