Telugu News

ఎన్కూరు మిర్చి రైతులను ఆదుకోవాలి -కిసాన్ కాంగ్రెస్ డిమాండ్ .

0

ఎన్కూరుమిర్చి రైతులను ఆదుకోవాలి -కిసాన్ కాంగ్రెస్ డిమాండ్

తామర పురుగు వల్ల నష్టపోయిన మిర్చి రైతులను ఆదుకోవాలని జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు మొక్క శేఖర్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
శనివారం నాడు ఏన్కూరు మండలం లచ్చగూడెంలొ తెగుళ్ల వల్ల నష్టపోయిన మిర్చి తోటలను కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పరిశీలించారు
ఈసందర్బంగా మొక్క శేఖర్ గౌడ్ మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ లేనివిధంగా మిర్చి తోటలకు తెగులు వచ్చి మిర్చి తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి దీని వల్ల పెట్టుబడి ఎక్కువై మరో పక్క పంట దిగుబడి లేక రైతులు ఏం చేయాలో దిక్కుతోచక ఆత్మహత్యలు
చేసుకుంటున్నారని కావున ప్రభుత్వం మిర్చి రైతులకు ఎకరానికి లక్ష రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పది లక్షల రూపాయల చొప్పున ఇవ్వాలన్నారు

also read :-కటకటలకు కామాందుడు.. వనమా రాఘవ అరెస్ట్ 

ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెంచి కొనుగోలు వేగవంతం చేయాలని తరుగుపేరుతో దోచుకుంటున్న వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు ఈనెల తొమ్మిదిన మధిర నియోజకవర్గం ముదిగొండ మండలం యడవల్లి లొ ప్రారంభమవుతున్న భట్టి విక్రమార్క మహా పాదయాత్రను విజయవంతం చేయాలని ముఖ్యంగా రైతు సమస్యల పరిష్కారం కోసమే యాత్ర చేస్తున్నారని కాబట్టి రైతులు విరివిగా పాల్గొనాలని పాల్గొనాలని తమ సమస్యలను వివరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ నాటకాలాడుతున్నాయని రైతుల నడ్డి విరుస్తున్నాయని అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ కాంగ్రెస్ నాయకులు చల్లా వెంకటేశ్వర్లు ఏన్కూరు మండలం కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇరపా నర్సింహారావు . లచ్చగూడెం గ్రామ సర్పంచి శ్రీమతి బండ్ల విజయకుమారి మండల కిసాన్ కాంగ్రెస్ నాయకులు దణాచారి సుధాకర్
దుగ్గినేని రామారావు ఎర్రా సాంబయ్య. వచ్చా మల్లేష. భూపతి రాంబాబు తదితరులు పాల్గొన్నారు ,