Telugu News

ఒక ఊరి నుంచి 21మంది ఎంపిక

గురుకుల ప్రవేశపరీక్షల్లో టిఎల్ పేట విద్యార్థుల ప్రతిభ*

0

ఒక ఊరి నుంచి 21మంది ఎంపిక

◆◆ గురుకుల ప్రవేశపరీక్షల్లో టిఎల్ పేట విద్యార్థుల ప్రతిభ*
◆◆ 25 మందిలో 21మంది ఎంపికపై హర్షం

◆◆ రికార్డు సృష్టించిన చిన్నారులు

◆◆ ట్యూషన్ మాస్టార్ ను సన్మానించిన సర్పంచ్ , గ్రామస్తులు

ఏన్కూరు, జూన్ 19(విజయంన్యూస్)

అతిమారుమూల గ్రామం.. మండల కేంద్రానికి కూడ దూరమే ఆ ఊరు.. మంచి చదువుకావాలంటే ఖమ్మం, కొత్తగూడెం మో వెళ్ళాల్సి ఉంటుంది.  ఆ గ్రామంలో ప్రభుత్వస్కూల్  ఒఒక్కటే దిక్కు.. అలాంటి పల్లెటూరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్నది. గురుకుల పరీక్ష ఫలీతాల్లో ఆ పల్లెటూరు చత్తా చాటింది. మొత్తం 25మంది పరీక్షలు రాస్తే 21మందికి సీట్లు సాధించి రికార్డ్ సృష్టించారు. ఆ క్రిడెట్ అంతా ఆ గ్రామంలో చిన్నారులకు ట్యూషన్ చెప్పిన మాస్టారుదే.. విజయం పత్రికలో ఏన్కూర్ విలేకరిగా పనిచేస్తున్న ఆయన పార్ట్ టైమ్ గా చిన్నారులకు ట్యూషన్ చెబుతున్న ఆ మాస్టార్ ను గ్రామస్థులు, సర్పంచ్ ఘనంగా సన్మానించారు.పూర్తి వివారాల్లోకి వెళ్తే

Allso read:- మాయమఅవుతున్న అడవులు

మండల పరిధిలోని తూతకలింగన్నపేట గ్రామానికి చెందిన విద్యార్థులు గురుకుల ప్రవేశ పరీక్షల్లో తమ ప్రతిభ కనబర్చారు. గత నెల 8తేదీన 5వ తరగతిలో జరిగిన గురుకుల ప్రవేశ పరీక్షల్లో ఈ గ్రామం నుంచి 22మంది విద్యార్థులు పరీక్ష రాశారు. శనివారం సాయంత్రం ప్రకటించిన ప్రవేశ పరీక్ష ఫలితాల్లో 21 మంది విద్యార్థులు వివిధ గురుకులాలకు ఎంపికయ్యారు. ఏన్కూరు, వైరా, లంకపల్లి గురుకుల విద్యాలయాల్లో సీట్లు సాధించారు. ఈ విద్యార్థులకు ఇదే గ్రామానికి చెందిన ప్రైవేట్ టీచర్ జుజ్జూరి కృష్ణమాచారి శిక్షణ ఇచ్చారు. ఒకే గ్రామం నుంచి 21 మంది విద్యార్థులు సీట్లు సాధించటం పట్ల మండల పరిషత్ వైస్ చైర్మన్ పాశం శ్రీనివాసరావు, గ్రామ సర్పంచ్ భానోత్ వీరభద్రం నాయక్, ఉపసర్పంచ్ నామా వెంకయ్య, ఎస్ఎంసి కమిటీ చైర్మన్ మంకెన మురళి, మాజీ ఛైర్మన్ రుద్రాక్షాల నాగాచారి, గ్రామస్తులు, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు విద్యార్థులను, శిక్షణ ఇచ్చిన జె.కృష్ణమాచారిని అభినందించారు. అనంతరం కృష్ణమాచారిని శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ చారి, నర్సింహా చారి, రాచబంటి శ్రీనివాసరావు, ఉపేందర్, సోమాచారి, నాగులుమీరా, తదితరులు పాల్గొన్నారు.