పర్యావరణ పరిరక్షణ మనందరి భాద్యత : మాజీ ఎంపీ పొంగులేటి
– మధిర పట్టణంలో క్లాత్ సంచులు, గొడుగుల పంపిణీ
– చర్చి నిర్మాణానికి రూ.25 వేల ఆర్ధిక సహాయం
– నూతన దంపతులకు పొంగులేటి ఆశీర్వాదం
– కార్యకర్తలు కుటుంబాలకు ఓదార్పు, ఆర్ధిక సహాయం
గురువారం ఖమ్మం మాజీ ఎంపీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, బోనకల్, మధిర, సత్తుపల్లి, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ, కొణిజర్ల, రఘునాధపాలెం మండలాల్లో పర్యటించారు.
మధిర : పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యతని ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మధిర పట్టణంలో మధిర సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా మాజీ ఎంపీ పాల్గొన్నారు. అనంతరం సుమారు 500 మంది స్థానికులకు క్లాత్ సంచులను, పెద్దలకు గొడుగులను అందజేశారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణ సమతౌల్యత దెబ్బతిని పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని అన్నారు. రోజు రోజుకూ పెరుగుతున్న సాంకేతికాభివృద్ధి, తరిగిపోతున్న అటవీ సంపద, కలుషిత వాతావరణంతో మానవుల జీవన రేటు తగ్గుతోందని అన్నారు. ప్రతీ ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని, భవిష్యత్తు తరాలకు మనమిచ్చే గొప్ప బహుమతి పచ్చని చెట్లు, స్వచ్ఛమైన గాలి మాత్రమేనని తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకం నిషేదించాలని అన్నారు. అనంతరం రెడ్డి గార్డెన్స్ లో శీలం వీర వెంకటరెడ్డి కుమారుని వివాహ వేడుకలో పాల్గొని దంపతులను ఆశీర్వదించారు.
also read :-భక్తుల కొంగుబంగారం మినీ మేడారం.
మధిర, వంగవీడు, చిలుకూరు గ్రామాల్లో ఇటీవల మరణించిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను పొంగులేటి పరామర్శించి, ఓదార్పునిచ్చారు. పలు కుటుంబాలకు ఆర్ధిక సహాయంను అందజేశారు. పొంగులేటి వెంట ఎస్సీ కార్పోరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి, డీసీసీబీ డైరెక్టర్ అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, జిల్లా టీఆర్ఎస్ నాయకులు డాక్టర్ కోట రాంబాబు, మున్సిపల్ కౌన్సిలర్ మొండితోక నాగరాణి, లక్ష్మారెడ్డి, దేవిశెట్టి రంగ, సొసైటీ చైర్మన్ కటికల సీతారామిరెడ్డి, లక్ష్మారెడ్డి, యన్న కోటేశ్వరరావు, చెరుకూరి నాగార్జున్, పల్లబోతు ప్రసాద్ రావు, సర్పంచ్ బొగ్గుల పద్మావతి, ఎంపీటీసీ అయిలూరి రామకోటమ్మ, అక్కినపల్లి నాగేశ్వరరావు, అయిలూరి జనార్ధన్ రెడ్డి, పరిమి బెంజ్ మెన్, మాజీ సర్పంచ్ నిగమనూరి జయమ్మ, శ్రీకాంత్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి, కొత్తపల్లి ప్రసాద్, చిలకా సత్యనారాయణ, వట్టికూటి సైదులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
also read :-వెంకయ్య మృతి పట్ల మంత్రి పువ్వాడ సంతాపం..
చర్చి నిర్మాణానికి మాజీ ఎంపీ పొంగులేటి ఆర్ధిక సహాయం
ఖమ్మం : ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం ఖమ్మం పట్టణంలో పర్యటించారు. ఖమ్మం క్యాంప్ కార్యాలయంలో వైరా మండలం గండుగులపాడు గ్రామస్థులు వారి ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రార్ధనా మందిరం వివరాలలను పొంగులేటికి తెలుపగా వారికి స్థానిక నాయకులు రాష్ట్ర మార్క్ ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, వైరా మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మా రోశయ్య, కొణిజర్ల ఎంపీపీ గోసు మధు సమక్షంలో రూ. 25వేల అందజేశారు. అనంతరం స్థానిక ఎస్ఆర్ కన్వెన్షన్ లో జరుగుతున్న అలేఖ్య అరున్ రెడ్డి వివాహ నిశ్చితార్థ వేడుకలో పాల్గొని దంపతులను ఆశీర్వదించారు. శాంతి లాడ్జిలో రిపోర్టర్ చారి కుమార్తె వివాహ నిశ్చితార్ధ మసూత్సవంలో పాల్గొని వధూవరులను దీవించి నూతన వస్త్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాజీ ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, కార్పోరేటర్ దొడ్డా నగేష్, భీమనాధుల అశోక్ రెడ్డి, కానుగుల రాధాకృష్ణ, దుంపల రవికుమార్, చింతమళ్ల గురుమూర్తి, కాంపాటి రమేష్, తంబి, యువనేత గోపి, నర్సింహారావు తదితరుతు పాల్గొన్నారు.
నవ దంపతులకు మాజీ ఎంపీ పొంగులేటి ఆశీర్వాదం
బోనకల్ : ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం స్థానిక సాయిబాబా ఆలయంలో నాయకులు బీరెల్లి కృష్ణ కుమార్తె వివాహ వేడుకలో పాల్గొని నవ వధూవరులను ఆశీర్వదించి నూతన వస్త్రాలను అందజేశారు. టీఆర్ఎస్ నాయకులు తోట గణేష్ సోదరుడు సాంబశివరావు ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యం కల్పించారు. పొంగులేటి వెంట మాజీ ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, జిల్లా టీఆర్ఎస్ నాయకులు డాక్టర్ కోటా రాంబాబు, బోనకల్ సర్పంచ్ సైదా నాయక్, రామాపురం సర్పంచ్ తొండపు వేణు, రాయన్నపేట సర్పంచ్ కిన్నెర పాపారావు, బ్రాహ్మణపల్లి జర్రిపోతుల రవీందర్, కళ్యాణపు నాగేశ్వరరావు, బండి వెంకటేశ్వర్లు, యన్నం కోటేశ్వరరావు, ఉమ్మినేని కృష్ణ, తమ్మారపు బ్రహ్మం, గొడుగు కృష్ణ, నల్లినబోయిన కృష్ణ, తోటకూర వెంకటేశ్వరరావు, మామాళ్ల కృష్ణయ్య, చింతలచెర్వు లక్ష్మీనారాయణ, షేక్ మస్తాన్, తమ్మారపు వెంకటేశ్వర్లు, పకీరయ్య,
కోయినేని ప్రదీప్, సీహెచ్ శ్రీనివాసరావు, వీరబాబు, కొరివి సురేష్, గణపారపు వెంకటేశ్వరరావు, దాసరి గణేష్, తదితరులు పాల్గొన్నారు.
నిశ్చితార్ధ వేడుకలో పాల్గొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి
సత్తుపల్లి : పట్టణ కేంద్రంలోని ఎంఆర్ గార్డెన్స్ లో జరుగుతున్న రావి నరసింహారావు కుమార్తె వివాహ నిశ్చితార్ధ మఘోత్సవ వేడుకలో ఖమ్మం మాజీ ఎంపీ, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం పాల్గొని వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం దంపతులను నూతన వస్త్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, మాజీ ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, సత్తుపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ తోట గణేష్- సుజలారాణి, మురళీరెడ్డి, గ్రాండ్ మౌలాలీ, ప్రసాద్ రావు, మందపాటి ముత్తారెడ్డి, అన్నపురెడ్డిపల్లి ఎంపీపీ సున్నం లలిత, కొణిజర్ల ఎంపీపీ గోసు మధు, మాజీ ఎంపీపీ జేష్ఠ అప్పారావు, నర్సింహారావు, కార్పోరేటర్ దొడ్డా నగేష్ తదితరులు పాల్గొన్నారు.
ఫోటోలు : 1) క్లాత్ సంచులు, గోడుగులను పంచుతున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి
2) చర్చి నిర్మాణానికి ఆర్ధిక సహాయంను అందజేస్తున్న మాజీ ఎంపీ పొంగులేటి
3) మధిరలో వధూవరులను నూతన వస్త్రాలను అందజేస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి
4) మృతుని చిత్రపటం వద్ద నివాళులు అర్పిస్తున్న పొంగులేటి, స్థానిక నాయకులు
5) సత్తుపల్లి ఎంబీ గార్డెన్స్ లో దంపతులను ఆశీర్వాదిస్తున్న మాజీ ఎంపీ పొంగులేటి
6) పొంగులేటిని అభినందిస్తున్న మధిర సేవా సమితి సభ్యులు