Telugu News

దైవ దర్శనానికి వెళ్లి.. కాలుజారీ.

ఇచ్చోడ మండలంలో విషాదం 

0

దైవ దర్శనానికి వెళ్లి.. కాలుజారీ.. 

== ఇచ్చోడ మండలంలో విషాదం 

(రిపోర్టర్ : కైలాస్)

ఇచ్చోడ ఆగస్టు 02 (విజయం న్యూస్) :
దైవ దర్శనానికి వెళ్లి తిరిగివస్తుండగా కాలు జారీ చెరువులో పడి గిరిజన యువకుడు మృతిచెందాడు. ఇచ్చోడ మండలంలోని ఎల్లమ్మ గూడ గ్రామానికి చెందిన పెందుర్ భుజంగ్ రావు(45) మంగళవారం ఉదయం సిరిచేల్మ లోని శివాలయనికి  పూజ కోసం వెళ్లి తిరిగి వస్తుండగా అకస్మాత్తుగా కాలు జారీ చెరువులో పడి మరణించినట్లు మృతుని సోదరుడు మానిక్ రావు తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సిరిచెల్మ ఆలయం చుట్టూ ఉన్న చెరువు పూర్తిగా నిండిపోగా ఆలయం చుట్టు నీళ్లు నిండిపోయాయి. దర్శనానికి వెళ్ళడానికి దారి లేకపోవడంతో భక్తులు అతి కష్టం పై వెళ్లి దర్శించు కొంటున్నారు.అయితే మృతునికి ఈత రాక పోవడంతో చెరువులో మునిగి మరణించినట్లు తెలిసింది. కాగా పోలీసులు పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.