యాదాద్రిలో ప్రతి భక్తుడికి దర్శన భాగ్యం ఉంటుంది: మహేష్‌భగవత్
(యాదాద్రి:విజయం న్యూస్);-
భక్తులు టికెట్ కౌంటర్లో రిజిస్ట్రేషన్ చేపించుకోవాలని సీపీ మహేష్‌భగవత్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ భక్తులకు క్యూఆర్ కోడ్ ఇస్తారని, దానికి జియో ట్యాగింగ్ ఉంటుందని చెప్పారు. క్యూకాంప్లెక్స్‌లో 8 వేల మంది వేచి ఉండే సామర్థ్యం ఉందన్నారు. ర్యాంప్, ఎస్కలేటర్, స్టేర్ కేస్, లిఫ్ట్ సౌకర్యం కల్పించారని తెలిపారు. సోమవారం ప్రతి భక్తుడికి దర్శన భాగ్యం ఉంటుందని పేర్కొన్నారు. ఎల్లుండి నుంచి ఆలయ సమయ వేళల ప్రకారం దర్శనాలుంటాయని తెలిపారు.
also read;-ఉద్యోగ నోటిఫికేషన్ ఇంకేప్పుడూ..? భట్టి
ఆలయం తరపున 88, పోలీస్ శాఖ తరపున 150 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని మహేష్‌భగవత్ చెప్పారు. యాదాద్రిక్షేత్రంలో ఈ నెల 28న ప్రధానాలయ ఉద్ఘాటన,మహాకుంభ సంప్రోక్షణ పర్వాలు సజావుగా సాగేందుకు పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. రాచకొండ సీపీ మహే్‌షభగవత్ పర్యవేక్షణలో డీసీపీ కె.నారాయణరెడ్డి ఆధ్వర్యంలో సుమారు 2వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. ఈనెల 27వ తేదీ నుంచే కొండపైన, కొండకింద అన్ని ప్రాంతాలను పోలీసులు ఆధీనంలోనికి తీసుకున్నారు. భక్తులు, వీవీఐపీలు ఎక్కువగా సంచరించే ప్రదేశాల్లో డాగ్, బాంబ్‌స్క్వాడ్ సిబ్బంది మెటల్ డిటెక్ట ర్లు,బాంబ్ డిటెక్టర్లతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. కొండకింద, పైన పలు ప్రాంతాల్లో తాత్కాలిక టెంట్లతో పోలీస్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు..