Telugu News

ప్రతి ఒక్కరిలో క్రీడా స్పూర్తి ఉండాలి: రఘురాం రెడ్డి 

క్రికెట్ విజేతలకు ఆర్ఆర్ఆర్ బహుమతుల ప్రధానం

0
ప్రతి ఒక్కరిలో క్రీడా స్పూర్తి ఉండాలి: రఘురాం రెడ్డి 
== క్రికెట్ విజేతలకు ఆర్ఆర్ఆర్ బహుమతుల ప్రధానం
(ఖమ్మం-విజయం న్యూస్)
 నగరంలోని 48వ డివిజన్ లో టీబీపీఎల్  క్రికెట్ టోర్నీ  విజేతలకు కాంగ్రెస్ ఖమ్మం లోక్ సభ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి గురువారం రాత్రి బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఓ మంచి క్రికెటర్ నేనని, కాలేజ్ సమయంలో బాగా ఆడేవాడినని, హెచ్ సీ ఏ లో ప్యాటరన్ గా చేశానని గుర్తుచేశారు. 36 టీములతో ఆడించడం పట్ల నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ నగర అధ్యక్షులు మహమ్మద్ జావిద్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, మాజీ కార్పొరేటర్ నాగండ్ల దీపక్ చౌదరి, నాయకులు యడ్లపల్లి సంతోష్, బోజెడ్ల సత్యనారాయణ, లక్ష్మీ, కొప్పుల చంద్రశేఖర రావు, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మొక్కా శేఖర్ గౌడ్,  సయ్యద్ హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.