రాజ్యాంగ స్పూర్తిని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి: పువ్వాళ్ల దుర్గప్రసాద్
జిల్లా కాంగ్రెస్ ఆధ్యర్యంలో విజయవంతమైన సెమినార్
రాజ్యాంగ స్పూర్తిని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి
??మత గ్రంథాల కన్నా గొప్పది భారత రాజ్యాంగం
??సెమినార్ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు
??జిల్లా కాంగ్రెస్ ఆధ్యర్యంలో విజయవంతమైన సెమినార్
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
దేశప్రజలందరి క్షేమాన్ని ద్రుష్టిలో పెట్టుకుని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యంగాన్ని రచించారని, ఆ రాజ్యాంగ స్పూర్తిని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గప్రసాద్ కోరారు. శనివారం నగరంలో ఇల్లందు క్రాస్ రోడ్ లో గల టిటిడిసిలో రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం ప్రాముఖ్యత అనే అంశంపై శనివారం నిర్వహించిన సెమినార్ విజయవంతంగా ముగిసింది.
ఇది కూడా చదవండి: విషాదంలో విజేత.. కృతిక మనోదైర్యానికి లాల్ సలామ్
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వక్తలు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. స్వతంత్ర భారతావనిలో ప్రజలందరూ స్వేచ్ఛ సమానత్వం, సౌబ్రాతృత్వంతో కలిసి మెలిసి ఉండేందుకు సర్వసత్తాక సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగ కొనసాగాలని లక్ష్యంతో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో డ్రాప్టింగ్ కమిటీ 2
సంవత్సరాల 11 నెలల 18 రోజులు నిరంతరాయంగా శ్రమించి 60 దేశాల రాజ్యాంగాలను చదివి అన్ని విషయాలపై పరిశీలన చేసి 25 భాగాలు 448 ఆర్టికల్స్, 12 షెడ్యూల్ భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. వక్త యస్ ఆర్ బి జి యన్ ఆర్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ మరియు హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ పొలిటికల్ సైన్స్ వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల ఎందరో కష్టపడి అందరి అభిప్రాయాలు తీసుకొని రాజ్యాంగాన్ని రచించడం జరిగింది,కాంగ్రెస్ చాలా ముందు చూపుతో శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ,డాక్టర్ బి,ఆర్ అంబేద్కర్ లాంటి మేధావులతో రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పాటు చేసి ప్రపంచంలోనే అత్యంత బలమైన,గొప్ప రాజ్యాంగాన్ని రచించే అవకాశాన్ని వారికి ఇచ్చింది అని, రాజ్యాంగం మార్పులు చేయాలి అంటే కూడా అధి ప్రజల ద్వారా ఎన్నికైన పార్లమెంటు కు మాత్రమే అవకాశం ఉన్నది అని అన్నారు. ప్రముఖ వైద్యులు సామాజిక కార్యకర్త ఏంఫ్ గోపీనాథ్ మాట్లాడుతూ ప్రస్తుత దేశ పాలకులు ప్రజలను విడగొట్టి,విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పాలన సాగిస్తున్నారు అని,దేశ ప్రజలు అందరూ సమైక్యమై,సంఘటితమై పోరాడాలని,ప్రతి ఇంట్లో బైబిల్, కురాన్,భగవత్ గీత లాగే రాజ్యాంగం కూడా ఉండాలని ప్రతి ఒక్కరూ వారి పిల్లలకు రాజ్యాంగ స్ఫూర్తిని వివరించాలని,నా జీవిత కాలంలో నేను చూసిన రాజకీయ నాయకులు ముగ్గురే ముగ్గురు ఒకటి కొండపల్లి సీతారామయ్య, రెండు కాన్షిరామ్,మూడోవ వ్యక్తి ఈ దేశం
మొత్తం ఒకటి గా ఉండాలని భారత్ జోడో యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ అని అన్నారు. నా జీవిత కాలంలో నేను చూసిన రాజకీయ నాయకులు ముగ్గురే ముగ్గురు ఒకటి కొండపల్లి సీతారామయ్య, రెండు కాన్షిరామ్,మూడోవ వ్యక్తి ఈ దేశం మొత్తం ఒకటి గా ఉండాలని భారత్ జోడో యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ అని అన్నారు.
== విద్యావేత్త ఐవి రమణా మాట్లాడుతూ…
ప్రస్తుతం దేశం తీవ్రమైన సంక్షోభం లో ఉన్నది అని, దేశాన్ని కాపాడాటానికి దేశంలో ఉన్న ప్రతి పౌరుడు నడుంబిగించాలాని అలాంటి యువతను, అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ పార్టీ కదిలించి నడిపించాలని 2024 లో జరిగే ఎన్నికలు ఈ దేశ లో జరిగే అతి పెద్ద పోరాటం అని భారత రాజ్యాంగాన్ని,ప్రజాస్వామ్యాన్ని కాపాడాటనికి జరిగే ఆఖరి యుద్ధం గా ఆయన అన్నారు.
ఇది కూడా చదవండి: ప్రతి 18ఏళ్లు పూర్తైన వారికి ఓటు కల్పించాలి: కలెక్టర్