Telugu News

మణుగూరు మున్సిపాలిటీ లో అంతా షాడో మయం..

** మున్సిపాలటీలో అన్నితామై పనులు

0

అంతా షాడో మయం..
** మున్సిపాలటీలో అన్నితామై పనులు

** ఏం చేయాలన్న ఆ ఇద్దరేనంటా..?

** చేయ్యి తడపనిదే పనికాదంటా..?

** డ్రైవర్ల నియమాకల్లో భారీగా ముడుపులు..?

** మున్సిపాలిటీలో హడలెత్తిస్తున్న షాడోలు..
** పట్టించుకొని అధికారులు..

(మణుగూరు-విజయం న్యూస్);-

తహసీల్దార్ కార్యాలయంలో అన్ని తానై నడిపించారు..? అక్కడ లెక్కలు కుదరడం లేదని.. మున్సిపల్ కార్యాలయం వైపు మళ్లారు.. అంతా మాదేనంటూ గల్లాలు ఎగరేస్తున్నారు.. పని కావాలంటే మమ్మల్ని కలిస్తే ఇట్టే పని పటాక్ అంటూ ప్రచారం చేస్తున్నారు.. మేమే రాజులం..మేమే మంత్రులం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు..? పనుల నుంచి పైసల వసూళ్ల వరకు అన్ని తామై చేస్తున్నారు..? షాడో కమీషనర్ అవతారమెత్తి అందినకాడికి దండుకుంటున్నారు.. అసలువారేవ్వరు..? ఎందుకు ఇలా చేస్తున్నారో.. ’విజయం‘ ప్రతినిధి అందించే ప్రత్యేక కథనం..

దశాబ్ద కాలం క్రితం ఏర్పడిన మణుగూరు మున్సిపాలిటీకి ఎంతో మంచి పేరు ఉంది.. ఎంతో మంది అధికారులు వచ్చారు.. పోయారు..? కానీ కార్యాలయానికి చెడ్డపేరు వచ్చేలా చేయలేదు..? గతంలో షాడోలు ఉన్నప్పటికి కార్యాలయ బయటవరకే పరిమితమైయ్యేది..? అధికార ప్రజాప్రతినిధుల పేరు చెప్పి పనులు చేయించుకునే వారు..? కానీ ఓ వ్యక్తి వల్ల మణుగూరు మున్సిపాలిటీకే చెడ్డపేరు వచ్చిందనే చెప్పాలి..? అధికారుల పని తీరు,షాడో అధికారి అవినీతి గబ్బు తో మున్సిపాల్ కార్యాలయం అవినీతిమయంగా మారింది. రెవెన్యూ కార్యాలయంలో తమ చేతివాటంతో అవినీతి షాడో లుగా పేరు గడిచి ఘనులు మున్సిపాలిటీలో తిష్ట వేశారు. ఓ ప్రభుత్వశాఖ లో తాత్కాలిక ఉద్యోగిగా జీవితం ప్రారంభించిన ఆ వ్యక్తి అవినీతితో కార్యాలయం పనులు చక్కబెట్టి తదనంతరం బయటకు వచ్చిన షాడో కన్ను మణుగూరు మున్సిపాలిటీ పడింది. కమిషనర్ మున్సిపల్ ఉద్యోగుల అండ తనకు ఉందంటూ చెప్పుకుంటూ మున్సిపల్ కార్యాలయంలో పాగా వేసి, కార్యాలయ ఉద్యోగులపై జులుం ప్రదర్శిస్తున్నారు.

Allso read:- చెట్లను మింగేస్తున్న కలప తిమింగళాలు…?

అధికారి పేరు చెప్పుకుని మున్సిపల్ కార్యాలయంలో ప్రతి పనిని చెక్క పెడుతున్నారనే ఆరోపణలు ప్రజల నుండి బహిరంగంగా వెల్లువెత్తుతున్నాయి. కార్యాలయంకు పని కోసం వచ్చే ప్రజలను పట్టి పీడిస్తున్నట్లు తెలుస్తోంది. పని కో రేటు చెప్తూ ధ్రువీకరణ పత్రాలు జారీలో భారీగా చేతివాటం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మణుగూరు మున్సిపల్ కార్యాలయంలో ప్రతి పని షాడో కనుసన్నల్లోనే జరగాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. మున్సిపల్ కార్యాలయానికి సంబంధించి ఇటీవల నూతనంగా కొనుగోలు చేసిన వివిధ వాహనాలకు డ్రైవర్ల నియామకం కోసం చేపట్టిన పక్రియలో కూడా చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉద్యోగ నియామకం కొసం దరఖాస్తు చేసుకున్న డ్రైవర్ల ను కూడా ఉద్యోగాలు నియామకంలో కూడా అవినీతి షాడోలు ముఖ్య పాత్రను పోషించి తమ చేతివాటం చూపిస్తూ ఒక్కొక్కరి దగ్గర నుండి రూ.30వేల నుండి రూ.50 వేల వరకు వసూలు చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కార్యాలయానికి వచ్చి ప్రజలకు గేట్ ముందే కమిషనర్ కంటే ముందుగా ఈయనే దర్శనమే ఇచ్చి..

allso read :- బుల్లెట్ పై ప్రజల వద్దకు మంత్రి అజయ్.

కమిషనర్ ను కలవాలంటే ముందుగా ఆయన అనుమతి తీసుకునే విధంగా ఆయన క్రియేట్ చేస్తున్నట్లు సమాచారం.
** అధికారి బంటూవుగా..?
గతంలో అతను పనిచేసిన సమయంలో స్వామి భక్తి చూపించిన అధికారి, తిరిగి కమీషనర్ కార్యాలయంకు రావడంతో రావడంతో ఆ చిరు ఉద్యోగి షాడో అవతారమేత్తినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తన స్వామి భక్తిని చాటుతూ అవినీతి పర్వానికి తెర లేపుతున్నారని తెలుస్తోంది. అధికారుల సహాకారంతో ఇతని కార్యాకలాపాలు మూడు పువ్వులు ఆరు కాయలు చందంగా వర్థిల్లుతున్నాయని తెలుస్తోంది. కార్యాలయం ఉద్యోగిగా ఉదయమే ఆపీస్ కు చేరుకొని వివిధ పనుల కోసం వచ్చే వారికి మాయ మాటలు చెప్తు వారు నుండి మామూళ్ళు వసూలు చేస్తూ అనధికార పెత్తనం చెలాయిస్తూన్నారనే విమర్శలు సర్వత్ర వినిపిస్తున్నాయి. కార్యాలయంలో ప్రతి పనిలో చేతి వాటంతో జనన మరణ ధ్రువీకరణ పత్రాలు,ఆస్తి మార్పిడి, ధృవీకరణ సర్టిఫికేట్ వివిధ పథకాల లబ్ధిదారుల ఎంపికలలో డ్రైవర్ తో కలిసి చిన్న సర్టిఫికెట్ ను కూడా వదలకుండా మున్సిపాలిటీ ప్రజల నుండి భారీగా మామూలు దండుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మణుగూరు పురపాలక సంఘం లో ఎన్నడూ లేని విధంగా అవినీతి భాగోతం వర్థిల్లుతుందని ప్రజలు చర్చించుకుంటున్నారు.

** ఆ ఇద్దరి అండే అధికారికి కొండంత…?
మున్సిపల్ కార్యాలయంలో అనధికార ఉద్యోగుల పెత్తనంతో మున్సిపల్ ఉద్యోగులు సైతం ముక్కున వేలేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కార్యాలయంలో ఇంత జరుగుతున్న అవినీతి షాడో లపై మున్సిపల్ అధికారులు ఎందుకు నోరు మెదపడం లేదో అర్థం కావడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. పన్నుల వసూళ్లలోనూ పురపాలక సంఘం అభివృద్ధిలో లో అన్ని తానే అనే విధంగా వ్యవహరించే షాడో లపై చర్యలు చేపట్టడంలో ఎందుకు వెనుకాడుతున్నారో..? అర్థం కావడం లేదని ప్రజలు ప్రశ్నస్తున్నారు. మణుగూరు పురపాలక సంఘంలో సాగుతున్న అవినీతి అక్రమాలపై పలు పత్రికలు వార్తలు ప్రచురిస్తూ అవినీతిపై ఘోషిస్తున్న, కథనాలు వస్తున్న జిల్లా అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజలు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. పట్టణంలోని కొందరి సహాకారంతో అధికారి తన పనులు చక్కబెట్టుకుంటున్నారనే ఆరోపణలు సైతం వ్యక్తం అవుతున్నాయి. అవినీతి మరకలు షాడో ల బంధాలను అడ్డుకట్టవేసి అవినీతి కంపు నుండి మణుగూరు మున్సిపాలిటీ ని కాపాడేందుకు ఉన్నతాధికారులు దృష్టి కేంద్రీకరించాలని పట్టణ ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.

also read;-పేదల నడ్డి.. విరుస్తున్న వారాల వడ్డీ ..!