Telugu News

ఖమ్మంలో ఎటు చూసినా ప్రభం *జనం*

రఘురాం రెడ్డి తరఫున సినీ హీరో వెంకటేష్ ప్రచారంతో ఉప్పొంగిన ఖమ్మం

0

ఖమ్మంలో ఎటు చూసినా ప్రభం *జనం*

== రఘురాం రెడ్డి తరఫున సినీ హీరో వెంకటేష్ ప్రచారంతో ఉప్పొంగిన ఖమ్మం
== మంత్రి పొంగులేటి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరితో కలిసి ముందుకు
== భద్రాచలంలో ఆ రామయ్య, ఖమ్మానికి ఈ రఘు రామయ్య.. అంటూ భరోసా
== ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన.. పొంగులేటి ప్రభ బండ్లు

(ఖమ్మం-విజయం న్యూస్):

ప్రధాన రహదారులన్నీ జనంతో నిండాయి. కూడళ్ళ లో సందోహo నెలకొంది. రొడ్లెంట నిల్చొని, డివైడర్లు ఎక్కి, డాబాలపై ఉండి.. సినీ హీరో వెంకటేష్ ను చూడడం కోసం.. అంతటా బారులు తీరారు. ఎటు చూసినా జనమే కనిపించారు. కాంగ్రెస్ ఖమ్మం లోక్ సభ అభ్యర్థి రఘురాం రెడ్డి భారీ మెజారిటీని కాంక్షిస్తూ.. రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి తో కలిసి మంగళవారం రాత్రి ఖమ్మంలో రోడ్ షో ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించారు.

ఇది కూడా చదవండి:- రఘురాం రెడ్డి *విక్టరీ* జోష్

మొదటి నుంచీ కుటుంబ కథా చిత్ర నాయకుడిగా పేరొoదిన విక్టరీ వెంకటేష్ వస్తున్నాడని తెలిసి.. నగర ప్రజలతోపాటు, సమీప గ్రామాల నుంచి కూడా తండోపతండాలుగా తరలివచ్చారు. ఖమ్మం మయూరి సెంటర్ నుంచి మొదలైన రోడ్ షో జెడ్పీ సెంటర్, ఇల్లెందు క్రాస్ రోడ్ మీదుగా ఐటీ హబ్ వరకు కొనసాగింది. ఈ క్రమంలో తొలి నుంచి.. చివరి వరకు దారి పొడుగునా కిక్కిరిసిన జనం ఘన స్వాగతం పలికారు. మంత్రి పొంగులేటి శీనన్న భారీ చిత్రాల ఫ్లెక్సీలతో అలంకరించిన.. ట్రాక్టర్ల ప్రభ బండ్లు ముందుకు సాగుతూ.. అందరినీఆకట్టుకున్నాయి.స్వచ్ఛందంగా తరలివచ్చిన మహిళలు, యువతులు రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగారు. ఈ సందర్భంగా అందరినీ సినీ హీరో వెంకటేష్ ఆప్యాయంగా పలకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భద్రాచలం లో రామయ్య ఉన్నారని, ఖమ్మం ఎంపీ స్థానం పరిధి ప్రజల అభివృద్ధి కోసం పోటీలో ఉన్న రఘురామయ్య అండగా నిలుస్తారని అన్నారు. ప్రజాసేవ కోసం పోటీ చేస్తున్న రఘురాం రెడ్డిని గొప్ప మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ఇది కూడా చదవండి:- ఖమ్మం లో జోరు వాన