Telugu News

నేడు ఖమ్మంలో చంద్రబాబు పర్యటన

నాయకన్ గూడెం వద్ద ఘనస్వాగతం

0

నేడు ఖమ్మంలో చంద్రబాబు పర్యటన

== నాయకన్ గూడెం వద్ద ఘనస్వాగతం

== నాయకన్ గూడెం నుంచి ఖమ్మం నగరం వరకు మోటర్ సైకిళ్ల ర్యాలీ

== కేశ్వాపురంలో ఎన్టీఆర్ విగ్రహా అవిష్కరణ

== సర్దార్ పటేల్ స్టేడియంలో భారీ బహిరంగ సభ

== భారీగా ఏర్పాట్లు చేస్తున్న పార్టీ నాయకత్వం

== ఇంటింట తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించిన టీడీపీ శ్రేణులు

== ముమ్మర ప్రచారం..

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు  ఖమ్మం జిల్లా  పర్యటన ఖారారైంది. ఎన్నో రోజుల నుంచి చంద్రబాబు పర్యటనను ఏర్పాటు చేయాలని భావిస్తున్న జిల్లా పార్టీ నాయకుల కల ఇఫ్పుడు నేరవేరింది. మరో ఏడాది సమయంలో జనరల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు గాను చంద్రబాబు నాయకుడు ముందుగా ఖమ్మం జిల్లాను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభ, పలు చోట్ల ఎన్టీఆర్ విగ్రహాలను అవిష్కరించేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిథిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జ్జానేశ్వరరావు, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో భారీగా ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

ఇది కూడా చదవండి: ఖమ్మంలో నేడు టీడీపీ విజయశంఖారావం

ముందుగా ఇంటింట తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని ప్రారంభించిన నాయకులు, కార్యకర్తలు ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో, అన్ని గ్రామాల్లో ఇంటింట తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే ఫ్రతి గ్రామంలో ప్లెక్ల్సీలు, హోర్డింగ్ లు, బెలూన్స్, తోరణాలు, విద్యుత్ స్థంబాలకు పార్టీ జెండాలను ఏర్పాటు చేశారు. ఎక్కడ చూసిన పార్టీ జెండాలు, కొన్ని కూడలిలలో పార్టీ హోర్డింగ్ లే కనిపిస్తున్నాయి. అలాగే సర్థార్ పటేల్ స్టేడియంలో కూడా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. స్టేజీ, జనం బాగా తరలివస్తే అంతకు తగట్టుగా ఏర్పాట్లు చేసే పనిలో నిమగ్నమైయ్యారు. ముఖ్యంగా జన సమీకరణకు నాయకత్వం, కార్యకర్తలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. సుమారు లక్షన్నర నుంచి రెండు లక్షల మందిని తరలించే ఏర్పాటు జరుగుతున్నాయి.

== స్టేడియంలో ఏర్పాట్లు పరిశీలిస్తున్న రాష్ట్ర నాయకులు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిథిగా హాజరైయ్యే భారీ బహిరంగ సభ ను విజయవంతం చేయడానికి ఖమ్మం పార్లమెంటు అధ్యక్షులు కూరపాటి వెంకటేశ్వర్లు తో కలిసి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి, మాజీ రాజ్యసభ సభ్యులు కంభంపాటి రామ్మోహన్ రావు, సుబ్బారావు స్థానిక సర్దార్ పటేల్ స్టేడియం ను పరిశీలించారు. విగ్రహావిష్కరణ  చేయబోవు పాతర్లపాడు, కేశవపురం విగ్రహా స్థలాలను  పరిశీలించారు అనంతరం పార్టీ కార్యాలయానికి వచ్చిఅక్కడి ఏర్పాట్లను పరిశీలించారు తగు సూచనలు సలహాలు తెలిపారు.  అలాగే ప్రతి రోజు రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున ముఖ్యనాయకత్వం వచ్చి పరిశీలించి వెళ్తున్నారు.

ఇది కూడ చదవండి: తెలంగాణలో ‘అలిబాబా నూరు దొంగలు’ పాలన: అగునూరి మురళీ

== ఖమ్మంలో భారీ బైక్ ర్యాలీ..ఖమ్మం నగరం అంతా పసుపుమయం చేసిన తెలుగు తమ్ముళ్లు

ఖమ్మం నగరంలో పార్లమెంటు అధ్యక్షులు శ్రీ కూరపాటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నగర అధ్యక్షులు వడ్డెం విజయ్, 60 డివిజన్ ల అధ్యక్ష కార్యదర్శులతో కలిసి ఈనెల ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో జరగబోవు జాతీయ అధ్యక్షులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి బహిరంగ సభ విజయవంతం చేయాలని ఖమ్మం ప్రజలని కోరుతూ  భారీ బైక్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీకి అన్ని డివిజన్లో యువకులు మరియు మహిళలు సైతం ముందుకొచ్చి ఖమ్మం నగర ప్రధాన రహదారులపై జై ఎన్టీఆర్ జై తెలుగుదేశం జై చంద్రబాబు అనే నినాదాలతో ఖమ్మం నగరాన్ని హోరెత్తించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చంద్రహాస్, గుత్తాసీతయ్య, కేతినేని హరీష్, సానిబోయిన శ్రీనివాస్ గౌడ్, ప్యారిస్ వెంకన్న, గుండ పిన్ని నాగేశ్వరరావు, చండ్ర రవికుమార్, నున్నా నవీన్, లేళ్ల లక్ష్మణ్, కుక్కల ఆనందరావు, మందపల్లి రజనీ, తాడిశెట్టి స్వాతి, ఆత్మకూరు స్వప్న, కామ అనిత, రంగిశెట్టి మంగమ్మ, దేవకర్ణ, బుడిగ శ్రీను, జేమ్స్, కృష్ణవేణి, గోపి శంకర్, గోపిరవి, తదితరులు పాల్గొన్నారు.

== షెడ్యూల్ ఇలా..
చంద్రబాబు నాయుడు ఖమ్మం జిల్లా పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేశారు. ఈనెల 21న ఉదయం 9.30గంటలకు హైదరాబాద్ లో బయలుదేరగా, మధ్యాహ్నం 2.30గంటలకు నాయకన్ గూడెం కు చేరుకుంటారు. అక్కడ జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని చంద్రబాబుకు స్వాగతం పలకనున్నారు. అనంతరం పాలేరు, కూసుమంచి మీదగా కేశ్వపురం గ్రామ పంచాయతీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం వెంటనే అక్కడ నుంచి బయలుదేరి వరంగల్ క్రాస్ రోడ్డు మీదగా భారీ ప్రదర్శనగా మయూరి సెంటర్ నుంచి సర్దార్ పటేల్ స్టేడియం వరకు ర్యాలీ కొనసాగనుంది. అనంతరం ఏర్పాటు చేసిన బారీ బహిరంగ సభలో ఆయన హాజరుకానున్నారు. అనంతరం అక్కడ నుంచి బయలు దేరి రోడ్ వే ద్వారా బోనకల్ మీదగా ఏపీకి చేరనున్నారు. 

ఇది కూడా చదవండి: సిటి బస్టాండ్ గా ‘ఖమ్మం పాత బస్టాండ్’