Telugu News

రేపు జిల్లాకు తుమ్మల రాకా

10.30గంటలకు శ్రీసిటి నుంచి జిల్లా కాంగ్రెస్ ఆపీస్ కు తుమ్మల

0

రేపు జిల్లాకు తుమ్మల రాకా

== ఉదయం 9గంటలకు శ్రీసిటిలోని క్యాంఫ్ కార్యాలయంకు

== 10.30గంటలకు శ్రీసిటి నుంచి జిల్లా కాంగ్రెస్ ఆపీస్ కు తుమ్మల

== భారీ ర్యాలీ..కాన్వాయ్ తో ఖమ్మం నగరానికి రానున్న మాజీమంత్రి

== సంజీవరెడ్డి భవనంకు తొలిసారిగా రానున్న తుమ్మల

==  సీఎల్పీ నేత భట్టి, మాజీ ఎంపీ పొంగులేటితో కలిసి ప్రెస్ మీట్, నాయకులతో సమావేశం

== భారీగా ఏర్పాట్లు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రేపు ఖమ్మం జిల్లాకు రానున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి పాలేరు టిక్కెట్ ఆశించిన తుమ్మల నాగేశ్వరరావుకు సీఎం కేసీఆర్ కు మొండి చెయ్యి చూపించడంతో ఆ పార్టీని వదిలిన ఆయన, ఈ నెల 16న హైదరాబాద్ ఏఐసీసీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం తొలిసారిగా ఈ నెల 25న సోమవారం ఖమ్మం  జిల్లాకు తుమ్మల నాగేశ్వరరావు వస్తున్నారు. దీంతో తుమ్మల వర్గీయులు, అనుచరులు, కార్యకర్తలు జిల్లా సరిహద్దు నుంచి భారీ ర్యాలీగా స్వాగతం పలకాలని అనుకున్నారు.

allso read- చంద్రబాబు కు రిమాండ్ పొడిగింపు

కానీ తుమ్మల నాగేశ్వరరావు నేరగా ఖమ్మం రూరల్ మండలంలోని బారుగూడెం గ్రామంలో ఉన్న శ్రీసిటి లోని తన క్యాంఫ్ కార్యాలయంకు నేరుగా రానున్నట్లు ఆయన తనయుడు తుమ్మల యుగేందర్ తెలిపారు. ఉదయం 9గంటలకు శ్రీసిటి చేరుకుని పాలేరు నియోజకవర్గ నాయకులు, అభిమానులు, అనుచరులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనున్నారు. ఆ తరువాత 10.30గంటలకు శ్రీసిటి నుంచి భారీ మోటర్ సైకిల్, కార్ల ర్యాలీతో ఖమ్మం నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సంజీవ్ రెడ్డి భవనంలోకి తొలిసారిగా అడుగుపెట్టనున్నారు. 40ఏళ్ల రాజకీయ జీవితం మొత్తం కాంగ్రెస్ పార్టీపై పోరాటం చేసిన తుమ్మల నాగేశ్వరరావు తొలిసారిగా ఆయన కాంగ్రెస్ కార్యాలయంలోకి అడుగుపెట్టే పరిస్థితి వచ్చింది. అనంతరం అక్కడ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ తుమ్మల నాగేశ్వరరావును ప్రత్యేకంగా జిల్లా పార్టీ కార్యాలయంలోకి కండువ వేసి ఆహ్వానించనున్నారు.

== సీఎల్పీ నేత భట్టి, పొంగులేటితో భేటి..

జిల్లా కాంగ్రెస్ పార్టీ సంజీవ్ రెడ్డి భవనంలోకి అడుగుపెట్టే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆ తరువాత సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ, ఎన్నికలప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరి, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఖమ్మం నగర కమిటీ అధ్యక్షుడు మహ్మద్ జావిద్ తో బేటికానున్నారు. ఇద్దరు ప్రత్యేక సమావేశం అయిన అనంతరం పార్టీ కార్యాలయంలోని మీటింగ్ హాల్లో విలేకర్ల సమావేశం నిర్వహించనున్నారు.

allso read- ఖమ్మంలో కల్తీ పాలు బాగోతం

పార్టీలో ఎందుకు చేరాల్చి వచ్చింది.. రాబోయే రోజుల్లో పార్టీ కోసం ఏ విధంగా పనిచేయనున్నారు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ పరిస్థితులపై మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరించనున్నారు. అనంతరం తుమ్మల నాగేశ్వరరావు అనుచరులను పార్టీలో చేర్చే అవకాశం ఉంది. లేదంటే జాతీయ నాయకుడితో ఖమ్మంలో బహిరంగ సభను ఏర్పాటు చేసి తన అనుచరులను పార్టీలో చేర్చే అంశంపై చర్చింనున్నట్లు సమాచారం.

== భారీగా ఏర్పాట్లు

40ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కల్గిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరి తొలిసారిగా ఖమ్మం జిల్లా వస్తున్న తరుణంలో ఆయన అనుచరులు, కార్యకర్తలు, అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీగా ఏర్పాట్లు చేయనున్నారు. సుమారు 10వేల వాహనాలను, 1000 కార్లతో భారీ ర్యాలీ చేయాలని అనుచరులు భావిస్తున్నారు. అందుకే పాలేరు నియోజకవర్గంతో పాటు ఖమ్మం నియోజకవర్గంలోని కార్యకర్తలు, నాయకులందరికి సమాచారం అందిస్తున్నారు. శ్రీసిటి నుంచి ఖమ్మం నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందుకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంను కూడా ముస్తాబు చేస్తున్నట్లు తెలుస్తోంది. తుమ్మల నాగేశ్వరరావుతో కూడిన ప్లెక్సిలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: తుమ్మల “ఖమ్మం” లో పోటీ..?