Telugu News

గుండె పోటుతో మాజీ ఎంపీటీసీ మృతి

జీళ్ళచెరువు లో అంత్యక్రియలు

0

గుండెపోటు తో మాజీ ఎంపీటీసీ మృతి

** జీళ్ళచెరువు లో అంత్యక్రియలు

(కూసుమంచి-విజయం న్యూస్)

గుండెపోటు తో మాజీ ఎంపిటిసి అకాల మృతి చెందిన సంఘటన బుధవారం తెల్లవారుజామున వరంగల్ క్రాస్ రోడ్ లో ఆయన నివాసంలో జరిగింది. కూసుమంచి మండలం గ్రామానికి చెందిన శ్రీనివాస్ మద్దెల శ్రీనివాస్ 45 వైద్య శాఖలో హెల్త్ అసిస్టెంట్ గా పని చేస్తున్నారు ఆయన గతంలో జిళ్ళచెరువు ఎంపీటీసీగా పని చేశారు. రోజువారీగా ఎంతో యాక్టివ్ గా ఉండే శ్రీనివాస్ బుధవారం తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తుం డగా అకస్మాత్తుగా గుండె పోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు దీంతో మార్గమధ్యంలోనే ఆయన మృతి చెందినట్లు తెలుస్తుంది. చెరువు జీళ్ళచెరువు  అయ్యప్ప స్వామి పీఠం కి గురువుగా 15 ఏళ్ల పాటు పని చేశారు. అతికొద్ది రోజుల్లోనే అయ్యప్ప స్వామి మాలధారణ చేసి సుమారు వంద మంది అయ్యప్ప స్వామి మాలధారణ చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ కొనసాగిస్తున్న ఆయన అకాల మృతి పట్ల అయ్యప్పస్వామి భక్తులు విషాదంలో మునిగిపోయారు. ఆయన స్వగ్రామమైన జీళ్ళచెరువు గ్రామంలో ఈరోజు అంత్యక్రియలు జరగనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

also read:- టీవీ చూస్తూ పిల్లలు భోజనం చేస్తే ప్రమాదమే