Telugu News

నేటి నుంచి పాపికొండల్లో విహారయాత్ర షూరు

ప్రారంభించనున్న ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్

0

నేటి నుంచి పాపికొండల్లో విహారయాత్ర షూరు

ప్రారంభించనున్న ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్

** రెండేళ్ల తరువాత ప్రారంభించనున్న ప్రభుత్వం

(పాపికొండలు-విజయం న్యూస్)

పర్యటకులకు ఎంతో ఇష్టమైన ప్రాంతం పాపికొండలు.. గోదావరి లో బోటుపై విహారయాత్ర అంటే ఇష్టపడనివారేవరుంటారు..ఆ విహారయాత్ర తిరిగి ప్రారంభం కానుంది. రెండేళ్ల తర్వాత తిరిగి పాపికొండల విహారయాత్రను ఇవాళ దేవీపట్నం మండలం పోశమ్మగండి ఆలయం నుంచి ప్రారంభం కానుంది. యాత్రకు బోట్లు సిద్దం చేశారు. రాజమహేంద్రవరంలో విహారయాత్రను మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రారంభించనున్నారు. 2019 సెప్టెంబరులో కచ్చులూరు వద్ద బోటు మునిగి యాత్రికులు చనిపోవడంతో యాత్రను అప్పట్లో నిలిపివేసిన ప్రభుత్వం.. తిరిగి ఈ రోజు ప్రారంభిస్తుంది..దీంతో పర్యటకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో జరిగిన ఘటనలు మళ్ళి తిరిగి పునారావృతం కాకుండా అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు.