Telugu News

కెసిఆర్ జన్మదిన వేడుకల్లో బహిర్గతమైన వర్గ విభేదాలు…..

మొక్కుబడిగా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు......

0

***కెసిఆర్ జన్మదిన వేడుకల్లో బహిర్గతమైన వర్గ విభేదాలు…..
***మొక్కుబడిగా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు……
***హజరైన ప్రజాప్రతినిధులు…….
***(చండ్రుగుండ- విజయం న్యూస్ ): –

సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే…… కానీ సంస్థాగతంగా అంతకు విరుద్ధంగా జరుగుతుంది…మండల కేంద్రంలో ఇవాళ మొదటి రోజు జరిగిన ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదిన వేడుకలను మొక్కుబడిగా జరిగినట్టుంది…

also read :-ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై బదిలీవేటు పడినట్టు తెలుస్తోంది.

మండలం లో అత్యంత శక్తివంతమైన పార్టీగా ఉన్నప్పటికీ, తెలంగాణ స్వరాజ్య రాష్ట్ర స్థాపనకు ప్రాణ త్యాగాని సిద్ధమైన కెసిఆర్ వేడుకలకు మండలంలోని ప్రజాప్రతినిధులు హజరు కావడంతో… మరొకసారి వర్గ భేదాలు బయట పడినట్లు అయినది….
మండలంలో ముఖ్య నాయకులైన , ఎంపీపీ, వైస్ ఎంపీపీ , గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, సొసైటీ చైర్మన్ లు, డైరెక్టర్లు, గ్రామ అధ్యక్షులు సైతం కూడా మండల కేంద్రంలో జరిగే వేడుకలకు దూరంగా ఉన్నారు….

గత కొన్ని రోజులుగా మండలంలో జరిగే ఎమ్మెల్యే పర్యటన, మండలంలో జరిగే పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు తెలియ చేయకపోవడం వలన పార్టీలో ఉన్న నాయకులు రెండు వర్గాలుగా చీలిపోయి ఎవరి కార్యక్రమాలు చేసుకుంటున్నారు…..
ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెడుతున్న దళిత బందు విషయంలో కూడా ఎమ్మెల్యే అనుచరులకు పెద్దపీట వేస్తున్నారని, మండలంలోని గ్రామాల అభివృద్ధికి సంబంధించిన ఏ విషయాలు కూడా తెలియపరచక పోవడంతో, విభేదాలకు మూల కారణం అవుతున్నాయి…..

also read :-***కేసీఆర్ జననం తెలంగాణ ప్రజలకు వరం : మంత్రి గంగుల కమలాకర్

కొంత మంది నేతలు మేము టిఆర్ఎస్ పార్టీ కాదు గుర్తుపై గెలిచి అవమానాలు భరించాల్సి వస్తోందని…. ఈ విషయాలపై జిల్లా అధ్యక్షులకు, రాష్ట్ర స్థాయి నేతలను కలిసి మండలంలో జరుగుతున్న ఒంటెత్తు పోకడలను వివరిస్తామని తమ సన్నిహితుల వద్ద మాట్లాడుకుంటున్నారు
మండలంలోని పార్టీ రెండు వర్గాల గా విడిపోవడంతో, పార్టీ కార్యకర్తలు పక్క పార్టీ వైపు చూస్తున్నారని, మండలం లో గుసగుసలు వినపడుతున్నాయి…