Telugu News

జిల్లాలో ఓ కుటుంబ కుల బహిష్కరణ

అడ్డు జెప్పిన కులపెద్దలు.. అంగీకరించలేదని కులాన్ని బహిష్కరిస్తూ అగ్రిమెంట్లు

0

జిల్లాలో ఓ కుటుంబ కుల బహిష్కరణ

==  ప్రేమ జంట కులాంతర వివాహం

== అడ్డు జెప్పిన కులపెద్దలు.. అంగీకరించలేదని కులాన్ని బహిష్కరిస్తూ అగ్రిమెంట్లు

== ఆగ్రహించిన కుటుంబం.. వీఎం బంజర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

== దర్యాప్తు చేస్తున్న పోలీసులు

(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్)

ఖమ్మం జిల్లాలో కులాంతర వివాహం చేసుకున్నందుకు  ఒక కుటుంబాన్ని కుల బహిష్కరణ చేసిన సంఘటన   ఆలస్యంగా వెలుగోకి వచ్చింది.వివరాల్లోకి వెళితే…పెనుబల్లి మండలం మండాలపాడు గ్రామంలో మందుల కులానికి చెందిన పెండ్ర రాంబాబు పెద్ద కుమార్తె జీవిత కు… ఎస్సీ కులస్తుడు అయిన సంపత్ లకు సంవత్సరం క్రితం కులాంతర ప్రేమ వివాహం జరిగింది. సంపత్, జీవిత లు ప్రస్తుతం హైదరాబాద్ లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నారు.

ఇది కూడా చదవండి: సత్తుపల్లి పై షర్మిల బాణం.

ఇదిలా ఉండగా జీవిత కుల పెద్దలు….తండ్రి  పెండ్ర రాంబాబు, సోదరుడు పెండ్ర గోపాలరావు కుటుంబాన్ని కుల పెద్దలు కక్షపూరితంగా తమ కులం నుంచి బహిష్కరిస్తున్నట్టుగా ఒక లేఖను విడుదల చేశారు. పెండ్ర రాంబాబు, గోపాలరావు కుటుంబ సభ్యుల ఇళ్లకు శుభకార్యాల నిమిత్తం కులంలోని వారు ఎవరైనా వెళ్ళిన చో 2,000 రూపాయలు, వాళ్లతో మాట్లాడితే 1,000 రూపాయలు మందుల కులానికి చెందిన అమ్మాయి వేరే కులం వారితో పెళ్లి జరిగినట్లయితే 10,000 మందులు కులానికి చెందిన అబ్బాయి వేరే కులం అమ్మాయితో పెళ్లి జరిగినట్లయితే 20,000 వేల రూపాయలు జరిమానా విధిస్తామన్నట్లుగా ఒక లేఖను విడుదల చేసి వాట్సాప్ గ్రూపులో పెట్టడం కలకలం రేపింది. ఈ విధంగ తమ కుటుంబాన్ని కుల బహిష్కరణ చేస్తూ వాట్సాప్ గ్రూపులో ప్రచారం చేస్తున్నారని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నామని పెండ్ర రాంబాబు, గోపాలరావు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కుల బహిష్కరణ చేస్తున్నట్లు ప్రకటించిన 13 మందిపై విఎంమంజర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టామనీ… తమను మానసికంగా క్షోభకు గురిచేసిన వారిపై పోలీసు వారు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు.దీంతో విచారణ చేపట్టిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ 13మంది పెద్దమనుషులపై కేసు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: నేనే రేడీ అంటున్న కోమటిరెడ్డి