Telugu News

ఖమ్మంలో పోలీస్ యంత్రాంగం విస్తృత తనిఖీలు.

శుక్రవారం ఒకరోజే 24 లక్షల నగదు, 20 బంగారు ఆభరణాలు, అక్రమ మద్యం సీజ్

0
ఖమ్మంలో పోలీస్ యంత్రాంగం విస్తృత తనిఖీలు.
== శుక్రవారం ఒకరోజే 24 లక్షల నగదు, 20 బంగారు ఆభరణాలు, అక్రమ మద్యం సీజ్
(ఖమ్మం-విజయం న్యూస్)
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం పోలీస్ యంత్రాంగం  కమిషనరేట్ వ్యాప్తంగా  విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. శుక్రవారం ఒక్కరోజే 24 లక్షలు నగదు, 20 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు ,18 వేల రూపాయల విలువ చేసే అక్రమ మద్యాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు.
ఎన్నికల కోడ్‌ వచ్చినప్పటి నుంచి గురువారం వరకు ఎస్ఎస్టీ &పోలీస్  రూ,,1,00,59,130 సీజ్ చేశాయని, ఎప్ఎస్టీ, పోలీస్ & ఎక్సైజ్ శాఖ రూ.46,36,883 రూపాయల అక్రమ మద్యాన్ని, అదేవిధంగా రూ.11,47,000లక్షల విలువ చేసే 44 కేజీల గంజాయి పోలీస్ & ఎక్సైజ్ శాఖల తనిఖీలలో సీజ్ చేసినట్లు తెలిపారు. రెండు రోజులుగా తనిఖీలు మరింత ముమ్మరంగా చేస్తున్నామని,ఇందుకోసం ఏసీపీల పర్యవేక్షణలో సిఐలు, ఎస్సైలు ఆధ్వర్యంలో 200 మంది పోలీస్ సిబ్బంది ప్రత్యేక తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో నగదు,  మాధకద్రవ్యాలు, మద్యం ప్రభావాన్ని నిలువరించేందుకు
21 స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, 22 ఫ్లైయింగ్ స్క్వార్జ్ టీమ్స్, సరిహద్దు చెక్ పోస్టులు,  2 ఇంటిగ్రేటెడ్ ఇంటర్ స్టేట్ బోర్డర్ చెక్ పోస్టులు, 10 ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులు, 8 ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని, 24 x7 గట్టి నిఘా ఉంచామని తెలిపారు.
స్వేచ్ఛాయుత వాతావరణంతో కూడిన నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణ లక్ష్యంగా  ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి అన్ని మార్గాల్లో చెక్‌ పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. సరిహద్దుతో పాటు నగరంలో   రాకపోకలు సాగించే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా
సరైన ఆధారాలు చూపించకుండా తరలించే నగదు,నగలు, ఇతరత్రా సొత్తును సీజ్‌ చేసి, సంబంధిత అధికారులకు అప్పగిస్తారని తెలిపారు. ఎన్నికల నిబంధనల మేరకు రూ. 50 వేలకు మించి నగదు తీసుకువెళ్లరాదని, పెద్ద మొత్తంలో నగదు, ఆభరణాలు ఉంటే తప్పనిసరిగా వెంట సంబంధిత పత్రాలు ఉండాలని సూచించారు.