జిల్లాలో పొంగులేటి విస్తృత పర్యటన
== పలు కుటుంబాలను పరామర్శించిన పొంగులేటి
== నూతన దంపతులను ఆశీర్వదించి పట్టువస్త్రాలను అందించిన మాజీ ఎంపీ
(ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్);-
తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం ఖమ్మం జిల్లాలో ముమ్మరంగా పర్యటించారు. పర్యటనలో భాగంగా నగరంలోని మామిళ్లగూడెంలో డైమండ్ టవర్స్ అపార్ట్ మెంట్ లో నూతన గృహప్రవేశ వేడుకకు హాజరై రాయపూడి వెంకటేశ్వర్లు దంపతులకు అభినందనలు తెలిపారు. పట్టు వస్త్రాలను కానుకగా సమర్పించారు. పొంగులేటి వెంట టీఆర్ఎస్ నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి, డీసీసీబీ మాజీ ఛైర్మన్ మువ్వా విజయబాబు, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, చావా శివరామకృష్ణ, దుంపల రవికుమార్, షేక్ ఇమామ్, తోట ప్రసాద్, చింతమళ్ల గురుమూర్తి, యువనేత గోపి తదితరులు పాల్గొన్నారు.
== కూసుమంచిలో
కూసుమంచి: కూసుమంచి మండలంలో మాజీ ఎంపీ పొంగులేటి పర్యటించారు. పర్యటనలో భాగంగా జీళ్లచెర్వులో ఐతగాని వెంకన్న కుమారుని ఐతగాని కిట్టు వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కూసుమంచిలో కొప్పుల దేవయ్య కుమారుని వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులకు పట్టువస్త్రాలను కానుకగా సమర్పించి దీవెనలు అందజేశారు. ఈ పర్యటనలో పొంగులేటి వెంట తెరాస రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి, డీసీసీబీ మాజీ ఛైర్మన్ మువ్వా విజయబాబు, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, కొణిజర్ల ఎంపీపీ గోసుమధు, కూసుమంచి మండల నాయకులు బజ్జూరి వెంకటరెడ్డి, కొత్త పుల్లారెడ్డి, బారీ శ్రీను, కందాల రవి, మజీద్, ఇతర మండలాల నాయకులు వట్టికూటి సైదులు గౌడ్, చింతమళ్ల గురుమూర్తి తదితరులు ఉన్నారు.
== గంగమ్మ దేవాలయ ప్రతిష్టా వేడుకలో పొంగులేటి
తిరుమలాయపాలెం: తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం తిరుమలాయపాలెం మండలంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా పిండిప్రోలు గ్రామంలో జరుగుతున్న గంగమ్మ అమ్మవారి దేవాలయ ప్రతిష్టా మఘోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ నిర్వాహకులు ఆలయ మర్యాదాలతో పొంగులేటిని ఘనంగా సత్కారించారు. ఈ పర్యటనలో పొంగులేటి వెంట తెరాస రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి, డీసీసీబీ మాజీ ఛైర్మన్ మువ్వా విజయబాబు, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, కార్పొరేటర్ దొడ్డా నగేష్ , మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్ చావా శివరామకృష్ణ, చల్లా వెంకటేశ్వర్లు, కొక్కిరేణి ఎంపీటీసీ అంబేద్కర్, కొక్కిరేణి ఉపసర్పంచ్ ఉపేందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బత్తుల రవికుమార్, గ్రామ శాఖ అధ్యక్షులు కర్నాటి రాజేంద్రప్రసాద్ , మండల కోశాధికారి పోట్ల ప్రవీణ్, ఎస్సీ సెల్ అధ్యక్షులు చుంచు వెంకటేశ్వర్లు , మండల కో ఆప్షన్ మెంబర్ సైపుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
== నకిరేకల్ లో
నకిరేకల్: తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం సూర్యపేట జిల్లా నకిరేకల్ లో పర్యటించారు. పర్యటనలో భాగంగా నకిరేకల్ లోని వైఎస్ రెడ్డి నగర్ హైమగార్డెన్స్ లో జరిగిన నకిరేకంటి లక్ష్మమ్మ-మట్టపల్లిల కుమారుని వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. పట్టు వస్త్రాలను కానుకగా సమర్పించారు. ఈ వేడుకకు పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధుల కూడా హాజరైయ్యారు.