Telugu News

మిగిలిన మృతదేహాలు వెలికితీత..

మృతుల కుటుంబ సభ్యులకు అప్పగింత.

0

బ్రేకింగ్..
మిగిలిన మృతదేహాలు వెలికితీత..
మృతుల కుటుంబ సభ్యులకు అప్పగింత

(మంచిర్యాల ప్రతినిధి-విజయం న్యూస్):

మంచిర్యాల జిల్లా ఎస్ ఆర్ పి-3 గని ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాలను ఎట్టకేలకు వెలికితీశారు బుధవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మృతుడు చంద్రశేఖర్ మృతదేహాన్ని రెస్క్యూ టీం సభ్యులు బయటకు తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో మిగిలిన మూడు మృతదేహాలకు సైతం వెలికితీశారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించారు.. చంద్రశేఖర్ ది దండేపల్లి మండలం 9 గుడిసెల పల్లె కాగా సత్య నరసింహరాజుది ఖమ్మం జిల్లా ఇల్లందు కావడంతో మృతదేహాన్ని అక్కడికి తరలించారు. మిగిలిన ఇద్దరిలో కృష్ణారెడ్డి మృతదేహాన్ని ఆర్కె-8 కాలంలోని ఆయన స్వగృహానికి, లక్ష్మయ్య మృతదేహాన్ని ఆయన స్వగ్రామమైన మూలకాలకు తరలించారు ఆయా ప్రాంతాల్లో అంత్యక్రియలు జరిపించడానికి సింగరేణి యాజమాన్యం సైతం పలు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది కాగా ఈ ప్రమాద ఘటన సమాచారం తెలుసుకుని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షులు బి.వెంకట్రావు హుటాహుటిన గురువారం శ్రీరాంపూర్ చారు కృష్ణా రెడ్డి మృతదేహానికి నివాళులు అర్పించారు. శ్రీరాంపూర్ ఏరియా టీబీజీకేఎస్ నాయకులు మంద మల్లారెడ్డి, కేతిరి సుదర్శన్ రెడ్డి తదితరులు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు