Telugu News

కన్నుల పండువగా రాములోరి జలవిహారం…!

సాంప్రదాయబద్ధంగా తెప్పోత్సవం వేడుక

0

కన్నుల పండువగా రాములోరి జలవిహారం…!
– సాంప్రదాయబద్ధంగా తెప్పోత్సవం వేడుక
– భక్తులు లేకుండానే సాదాసీదాగా
– ఆలయ అధికారులు, వేద పండితుల సమక్షంలో
( విజయం -భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ) :-
భద్రాచలం దివ్య క్షేత్రంలో బుధవారం సాయంత్రం సీతారాముల జలవిహారం వేడుక సంప్రదాయబద్ధంగా జరిగింది. రాముని సన్నిధిలో నిర్వహించిన ఈ వేడుక భక్తులను కనువిందు చేసింది. మధ్యాహ్నం శ్రీ తిరుమంగై ఆళ్వార్ పరమ పద ఉత్సవం వేడుకను అర్చక స్వాములు నిర్వహించారు. అనంతరం సాయంత్రం రామాలయం ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో ఎదుట ఏర్పాటు చేసిన ప్రత్యేక నీటి కొలనులో శ్రీ సీతారాముల వారి తెప్పోత్సవం వేడుక ఘనంగా నిర్వహించారు.

also read :-మేడారం జాతర విజయవంతానికి అందరూ సహకరించాలి జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య

కోవిడ్ నిబంధనలు నేపథ్యంలో ఈ వేడుకను భక్తులు లేకుండానే కేవలం అర్చక స్వాములు సమక్షంలో జరిపారు. తొలుత అర్చకస్వాములు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ రాములోరి జలవిహారం వేడుక సాంప్రదాయబద్దంగా జరిగింది. ఈ వేడుకకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, భద్రాచలం ఏఎస్పీ ఆకాంక్ష యాదవ్, రామాలయం ఈవో శివాజీ, అర్చక స్వాములు తదితరులు పాల్గొన్నారు.