Telugu News

తరతరాలుగా వివక్షను ఎదుర్కొంటున్నాం : ట్రాన్స్ జెండర్

సమ్మెళనం లో ఆవేదన వ్యక్తం చేసిన తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్ జెండర్

0

తరతరాలుగా వివక్షను ఎదుర్కొంటున్నాం : ట్రాన్స్ జెండర్

== మాకు గుర్తింపు ఇవ్వండి..

== మమ్మల్ని మనుషులుగా చూడండి

== సమ్మెళనం లో ఆవేదన వ్యక్తం చేసిన తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్ జెండర్

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

తర తరాలుగా వివక్ష  ఎదుర్కొంటున్న మాకు ఎలాంటి గుర్తింపు లేదు. మాకూ అవకాశం ఇస్తే మేము ఎందులో తక్కువ  కాదు అని నిరుపిస్తం అంటూ ట్రాన్స్ జెండర్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఖమ్మం నగరంలో  తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్ జెండర్ సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనానికి రాష్ట్రం లోని ట్రాన్స్ జెండర్ దాదాపు మూడు వేల మంది హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఏం.పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు.  తెలంగాణ రాష్ట్రంలో  ఉన్న ట్రాన్స్ జెండర్ అందరూ ఒక దగ్గరకు చేరి వారి ఆరాధ్య దేవత మురిగి మాత ను పూజించారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ట్రాన్స్ జెండర్ ప్రతి మండలానికి నాయకులను ఎన్నుకొని వారికి కొన్ని బాధ్యతలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఖమ్మం నగరంలో రెండు రోజుల పాటు జరిగిన ఈ రాష్ట్ర సమావేశంలో ట్రాన్స్ జెండర్ ఎదుర్కొంటున్న వివక్ష, సొసైటీ లో ఒక భాగంగా ఎలా బతకాలనే దానిమీద చర్చించామన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. మీ తప్పు లేక పోయినప్పటికీ తర తరాలుగా వివక్ష ను ఎదుర్కొంటున్న నా కుటుంబ సభ్యులకు ఎన్ని ఇబ్బందులు ఎన్ని కష్టాలు వచ్చిన అండగా ఉంటాను. రాబోయే రోజుల్లో మనకు తప్పకుండా రాజ్యాధికారం వస్తుంది రాజ్యాధికారం రాగానే తెలంగాణ లో ఉన్న హిజ్ర సోదరీమణులందరికి డబుల్ బెడ్ రూం ఇల్లు తో పాటు మీ కుటుంబ సభ్యుడిగా జీవితాంతం ఉంటానన్నారు.

allso read- ఛత్తీస్‌గఢ్‌లో జవాన్లపై మావోయిస్టుల ఘాతకం