ఇల్లందులో ఆ పార్టీ విజయం తథ్యం: జోస్యం చెప్పిన ఎంపీ
== హరిప్రియ 50వేల మెజారిటీతో గెలుస్తుంది:
== ఇల్లందు బీఆర్ఎస్ సభ చరిత్రలో నిలిచింది
== ప్రజలు స్వచ్చంధంగా తరలివచ్చి దిగ్విజయం చేశారు:ఎంపీ రవిచంద్ర*
== ఈ సభతో హరిప్రియ 50వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తారన్న నమ్మకం మరింత బలపడింది:ఎంపీ రవిచంద్ర
== సభ విజయవంతం కావడంలో భాగస్వాములైన వారందరికి పేరుపేరునా ధన్యవాదాలు:ఎంపీ రవిచంద్ర
(ఇల్లందు-విజయం న్యూస్)
ఇల్లందులో బుధవారం జరిగిన బీఆర్ఎస్ “ప్రజా ఆశీర్వాద సభ”దిగ్విజయంగా ముగిసిందని,చరిత్రలో నిలిచిపోతుందని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు.అందరి అంచనాలను మించి అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేశారన్నారని, హరిప్రియ 50వేల ఓట్ల మెజారిటీతో గెలవడం ఖాయమన్న నమ్మకం మరింత బలపడిందన్నారు.
ఇది కూడా చదవండి:- మాయ మాటలు చెప్పే దొంగల్ని నమ్మొద్దు: రవిచంద్ర
బీఆర్ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ “ప్రజా ఆశీర్వాద సభ”దిగ్విజయంగా ముగిసిన సందర్భంగా ఇల్లందులో ఎంపీ రవిచంద్ర ఎమ్మెల్యే బానోతు హరిప్రియ హరిసింగ్ నాయక్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ దిండిగల రాజేందర్, మహబూబాబాద్ జిల్లా జెడ్పీ ఛైర్ పర్సన్ అంగోతు బిందులతో కలిసి విలేకరులతో మాట్లాడారు.సభ విజయవంతం కావడంతో భాగస్వాములైన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు, ప్రజలందరికి ఎంపీ రవిచంద్ర పేరుపేరునా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు.
ఇది కూడా చదవండి:- అందరికీ సొంత ఇల్లు ఉండాలనేదే కేసీఆర్ ధ్యేయం: రవిచంద్ర