Telugu News

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం తథ్యం:

ధీమా వ్యక్తం చేసిన మంత్రి పువ్వాడ

0

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం తథ్యం: మంత్రి
** ధీమా వ్యక్తం చేసిన మంత్రి పువ్వాడ

(ఖమ్మం విజయం న్యూస్):-

ఎన్నికలు ఏవైనా గెలుపు తెరాస పార్టీ దే అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.

శనివారం ఖమ్మం తెరాస జిల్లా పార్టీ కార్యాలయంలో ఎంపీ నామా నాగేశ్వరరావు గారితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు..

ఖమ్మం జిల్లాలో ఏ ఎన్నికలు నిర్వహించినా గెలుపు తెరాస పార్టీదే గెలుపని, శాసన మండలి స్థానిక సంస్థల కోటా ఎన్నికల్లో విజయం కూడా తెరాస పార్టీదేనని ధీమా వ్యక్తం చేశారు.

టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తాత మధు భారీ మెజార్టీతో గెలవబోతున్నారని వివరించారు.

ధాన్యం పండించిన రైతులకు నిరీక్షణ తప్పడం లేదని అన్నారు.

ధాన్యం కొనుగోలు ప్రక్రియను కేంద్రం ఇంకా ప్రారంభించకపోడం పట్ల మంత్రి అసహనం వ్యక్తం చేశారు.

దేశానికి అన్నం పెట్టే రైతన్నలపై కక్షసాధింపు చర్యలు ఎందుకని ప్రశ్నించారు.

వరి కోతలు ప్రారంభమై పంట చేతికొస్తున్నా.. కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో రైతులను ఆందోళకు గురిచేస్తోందన్నారు.

ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కోతలు ప్రారంభమై ధాన్యం ఇళ్లకు చేరుతున్నాయని అన్నారు.

ఉభయ జిల్లాల్లో వారం రోజుల క్రితం నుంచే రైతులు వరి కోతలు ప్రారంభించారని కానీ కేంద్రానికి మాత్రం ఆయా ధాన్యాన్ని కొనాలన్న ఆలోచన లేకపోయిందన్నారు.

రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే కొనాలని డిమాండ్ చేశారు.

తమిళనాడులో జరిగిన హెలీకాప్టర్ ప్రమాదంలో ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ గారితో పాటు వారి సతీమణి మరో 11 మంది మరణించడం బాధాకరమన్నారు.

బిపిన్ రావత్ గారి మరణం దేశానికి తీరని లోటని, ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం ప్రకటిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అనంతరం 2నిమిషాల పాటు మౌనం పాటించారు.

సమావేశంలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ గారు, డిసిసిబి ఛైర్మన్ కురాకుల నాగభూషణం గారు, మేయర్ పునుకొల్లు నీరజ గారు, సూడా చైర్మన్ విజయ్ గారు, AMC చైర్మన్ లక్ష్మీ ప్రసన్న గారు, జిల్లా పార్టీ కార్యాలయ ఇంచార్జి RJC కృష్ణ గారు, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు NV గారు తదితరులు ఉన్నారు.

also read :- క్రాస్ ఓటింగ్ జరిగిందా..?