Telugu News

***ముదిగొండలో నకిలీ పొద్దు తిరుగుడు విత్తనాలు

***నకిలీ విత్తనాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులు

0

***ముదిగొండలో నకిలీ పొద్దు తిరుగుడు విత్తనాలు
***నకిలీ విత్తనాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులు
***నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి వ్యవశాఖ కార్యాలయం వద్ద ధర్నా
***పంటలను పరిశీలించిన రైతు సంఘం నాయకులు
***(ముదిగొండ/ఖమ్మం-విజయంన్యూస్)
రైతన్నలను నకిలీ విత్తనాల బెడద వదలడం లేదు.. ఒక వైపు వానాకాల పంటలు వైరస్ కారణంగా రైతులకు తీవ్రనష్టాన్ని చూపించగా, మరో వైపు నకిలీ విత్తనాల భారీన పడిన రైతన్నలు మరింతగా నష్టపోతున్నారు. ఇప్పుడిప్పుడే పంటల చేతికందే దశలో ఉన్న సందర్భంలో యాసంగిలో వరిసాగు వద్దు.. ప్రత్యామ్నయ పంటలే లక్ష్యంగా రైతులు వ్యవసాయం రైతులు సాగు చేసుకోవాలని ప్రభుత్వం చెప్పగా, చేసేది లేక రైతులు ప్రత్యామ్నయ పంటల వైపు వెళ్తున్నారు.

also read :-*వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎంపీ పొంగులేటి

కాగా అదే అసరగా చేసుకున్న కొంత మంది వ్యాపారులు ప్రత్యామ్నయ పంటలకు సంబంధించిన నకిలీ విత్తనాలను మార్కెట్ లోకి తీసుకొచ్చి రైతులను నట్టేట ముంచేస్తున్నారు. ముదిగొండ మండలంలో ప్రత్యామ్నయ పంటలను సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. పొద్దుతిరుగుడు పంటను సాగు చేస్తున్న రైతులకు నకిలీ విత్తనాలతో పూర్తిగా నష్టపోయారు.దీంతో రైతు సంఘం నాయకులు స్పందించి ఎదుగుబోదుగు లేని పంటను పరిశీలించిన అనంతరం మండల వ్యవసాయశాఖ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే
ముదిగొండ మండలం గోకెనపల్లి గ్రామం లో నలబై మంది రైతులు సుమారు నూట యాభై ఎకరాల విస్తీర్ణంలో యాసంగి సీజన్లో పోద్దు తిరుగుడు పంట సాగు చేశారు. పంట సాగు చేసి రెండు నెలల అయింది. పంట ఎదుగుదల లేకుండా పూత రావడంతో రైతులు ఆశ్ఛర్యపోయారు. మహారాష్ట్ర పుణె లో ఓ కంపెనీ లేబుళ్లు అంటించిన విత్తన ప్యాకెట్లు గద్వాల కేంద్రం గా రైతులకు విక్రయించారు. దీంతో రైతులు పంటను సాగు చేయగా, కొందరు రైతులు వేసిన విత్తనాలు ప్రారంభం లోనే మొలకెత్తలేదు, ఇప్పుడు ఉన్న పంట కాపు దశ లేదు, ఒక్కటి, రెండు మొక్కలు కాపు వచ్చి ఒక పూవు కి బదులు ఇరవై, ముప్పై గుంపులు ఏర్పడి ఎర్రి కాపు వస్తుంది. ఫలితంగా అవి నకిలీ విత్తనాలు గా అర్ధం అవుతుందని రైతులు తెలిపారు. దీంతో సుమారు 40 మంది రైతులు తీవ్రంగా నష్టపోయినట్లు తెలుస్తోంది. కాగా రైతులు న్యాయం కోసం ఎదురుచూస్తున్నారు.
 రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా
గోకినపల్లి గ్రామానికి చెందిన సుమారు 40 మంది రైతులు పొద్దుతిరిగుడు పంటను సాగు చేయగా, నకిలీవిత్తనాలతో నష్టపోయారనే విషయాన్ని తెలుసుకున్న తెలంగాణ రైతు సంఘం బృందం శుక్రవారం రైతులు సాగు చేసిన పంటలను పరిశీలించారు. ఎదుగుదల లేని పంటలను పరిశీలించిన అనంతరం ముదిగొండ మండల వ్యవసాయ కార్యాలయం వద్ద నకిలీ విత్తనాలు తో తీవ్రంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, విత్తన కంపెనీ పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు ధర్నా నిర్వహించారు. అనంతరం వ్యవసాయ అధికారి రాధ కు వినతి పత్రం అందజేశారు.

also read :-.***ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణ రాష్ట్రంలో కలపాల్సిందే…

ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు, మాట్లాడుతూ రైతుల అవసరాలను సోమ్ము చేసుకోంటూ విత్తన కంపెనీ లు నకిలీ విత్తనాలు విక్రయం చేయడం జరుగుతుంది అని అన్నారు. నకిలీ విత్తనాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, రైతులు ఎకరాకు నలబై, ఏభై వేల రూపాయలు ఖర్చు పెట్టి పంట కాపు దశలో నష్టపోతున్నారు అని, జిల్లా అధికారులు వెంటనే స్పందించి నకిలీ విత్తనాలు పై విచారణ జరిపి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు వాసిరెడ్డి ప్రసాద్, మండల కార్యదర్శి కందుల భాస్కరరావు, సిపిఎం మండల కార్యదర్శి బట్టు పురుషోత్తం, వైస్ యంపిపి మంకెన దామెందర్, పయ్యావుల పుల్లయ్య,మందరపు వెంకన్న, రైతులు ఎస్ కె సోద్దు, పి రామారావు, వీరయ్య, శ్రీనివాస్ రావు, రామకృష్ణ,రామయ్య, యుగంధర్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు