Telugu News

రైతు చావుకు కారకులైన అధికార పార్టీ టిఆర్ఎస్ నాయకులను వెంటనే అరెస్టు చేయాలని……..

రాజకీయ సంబరం ఒక రైతు ఆయువు తీసింది......

0

రైతు చావుకు కారకులైన అధికార పార్టీ టిఆర్ఎస్ నాయకులను వెంటనే అరెస్టు చేయాలని……..

రాజకీయ సంబరం ఒక రైతు ఆయువు తీసింది……
లేని పక్షంలో అధికార పార్టీ నాయకులు ఇళ్లను ముట్టడిస్తాం….
ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గుగులోత్ మోహన్ నాయక్ ……
(చండ్రుగొండ-విజయం న్యూస్ )

మండలంలోని పోకల గూడెం గ్రామ పంచాయతీ శివారు బాల్య తండా కు చెందిన రైతు భూక్యా రామచంద్రు వయసు 50 ఈ యొక్క రైతు సుమారు తనకున్న ఆరు ఎకరాల వ్యవసాయ భూమిలో 5 ఎకరముల మిర్చి తోటను వేశారు ఈ సంవత్సర కాలంలో కలిసిరాక పంటకు ఎర్రనల్లి తెల్ల దోమ ఆశించడం తో మిర్చి తోట ముడత వచ్చి ఎండి పోయింది ఈ యొక్క పంటకు ఎనిమిది లక్షల కు పైగా పెట్టుబడి పెట్టారు వేసిన పంట చేతికి రాక పీకల్లోతు అప్పుల్లో కూరుకు పోవడంతో రైతు అప్పు ఎలా తీర్చాలని ఆవేదనతో మదన చెందుతూ గత వారం రోజులుగా దిగాలుగా ఉంటున్నాడు…

also read :-★ ప్రధాని మోదీకు మంత్రి పువ్వాడ ట్వీట్

ఒకరోజు కుటుంబ సభ్యులు అడగ గా ఏమీ లేదని చెప్పేశాడు.శనివారం నాడు తన దగ్గర ఉన్న పశువులను మేపడానికి అదే మిర్చి తోటకు వెళ్లి మేపి దిగాలుగా ఇంటికి చేరుకున్నాడు ఇంట్లో వాళ్ళతో ఇవాళ నా మనసు ఏమి బాగాలేదు అని చెప్పి తనలో తాను ఆవేదన చెందుతూ ఇంట్లోనే కుప్పకూలిపోయాడు హుటాహుటిన కుటుంబ సభ్యులు కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో తరలించగా బ్రెయిన్ స్ట్రోక్ గా నిర్ధారించి వెంటనే మెరుగైన వైద్య చికిత్స కోసం వెంటిలేటర్పై తరలించే క్రమంలో జూలూరుపాడు మండలం వినోబా నగర్ వద్ద భద్రాద్రి జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షునిగా నియమితులైనా రేగా కాంతారావు ఘన స్వాగతం పలికేందుకు అధికార పార్టీ నాయకులు కార్యకర్తలు తమ వాహనాలతో గుంపులుగుంపులుగా రోడ్డుపై కిక్కిరిసి పోవడంతో అంబులెన్స్ కు దారి లేక అక్కడే 20 నిమిషాలపాటు రోడ్డుపై ఉండటంతో ఆందోళనలతో కుటుంబ సభ్యులు టిఆర్ఎస్ నాయకులను అధికారులకు కుటుంబ సభ్యులు కాళ్లావేళ్లా పడినా అంబులెన్స్ కి దారి ఇవ్వక పోవడంతో 20 నిమిషాలు లేట్ అవ్వటం తో పరిస్థితి విషమించింది…

also read :-ములుగు జిల్లా లో ప్రభుత్వ నిషేధిత మావోయిస్టుపార్టీ అమర్చిన భారీ మందు గుండు సామాగ్రిని

ఖమ్మంలోని మమత హాస్పిటల్ కి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు కాగా ఆదివారం ఉదయం ఆ రైతు మరణించినట్లుగా వైద్యులు కుటుంబ సభ్యులకు తెలిపారు.. అలాగే పదినిమిషాల ముందు తీసుకువస్తే బతికే వాళ్ళని డాక్టర్లు తెలిపారు.. ఈ రైతు మరణానికి కారకులైన అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు కాంతారావు ని అరెస్టు చేసి ఆ కుటుంబాన్ని నష్టపరిహారం ఇచ్చి వెంటనే ఆదుకోవాలని ఆ రైతు యొక్క కుమారునికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గూగులోతు మోహన్ నాయక్ డిమాండ్ చేశారు లేనిపక్షంలో అధికార టీఆర్ఎస్ నాయకుల ఇళ్లను ముట్టడిస్తామని రేగా కాంతారావు గారి ఇ ఇంటి ముందు ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించడం జరిగింది..