Telugu News

ఉగాది తర్వాత ఢిల్లీలో రైతు ధర్నా -సీఎం కేసీఆర్

ధర్నాకు అందరూ కలిసి రావాలి

0

ఉగాది తర్వాత ఢిల్లీలో రైతు ధర్నా -సీఎం కేసీఆర్
== ధర్నాకు అందరూ కలిసి రావాలి
== నేను కూడా ధర్నాలో పాల్గొంటా
== ఈ నెల 24,25తేదీలల్లో రాష్ట్ర వ్యాప్తంగా పంజాబ్ తరహా రైతు ఉద్యమాలు
(ఢిల్లీ విజయం న్యూస్):-
కశ్మీర్ ఫైల్స్ పై మాట్లాడటం కాదుఫార్మర్ ఫైల్స్,ఇరిగేషన్ ఫైల్స్ పై మాట్లాడాలిరాష్ట్రంలో ఇప్పటికే నిర్వహించిన 30నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ దే పైచేయినెలాఖరు కల్లా119అసెంబ్లీ సిగ్మంట్ల సర్వే ఫలితాలువన్ రేషన్ వన్ నేషన్ మాదిరిగా దేశ వ్యాప్తంగా కేంద్రం ఒకటే పాలసీ ఉండాలిపంజాబ్ కో నీతి తెలంగాణకో నీతి ఉండకూడదు.. ధాన్యం సేకరణ విషయంలో కేంద్రం ఒకే విధానం ఉండాలి
పంజాబ్ లో కొన్న విధంగానే తెలంగాణలో వరిని కొనాలి
also read :-హోళీ పండుగ శుభాకాంక్షలు: మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌
రేపు మంత్రులు,ఎంపీల బృందం రేపు ఢిల్లీకి వెళ్లుతున్నాయి
ఆహర శాఖ మంత్రిని కలిసి వరిని కొనాలని డిమాండ్ చేస్తాం
కేంద్రం వరి కొంటుందని ఆశిస్తున్నాం

కేంద్రం పూర్తి స్థాయిలో ధాన్యం సేకరించాలి
పంజాబ్ లో కొన్నట్లే తెలంగాణలో కొనాలని టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశాం
ఇది రైతుల జీవన్మరణ సమస్య
ఈసారి యాసంగి ధాన్యం మొత్తం కేంద్రమే సేకరించాలి
30లక్షల ఎకరాల్లో వచ్చిన పంటను కేంద్రం కొనాలి
100% ధాన్యం కొనేదాక పోరాటం చేస్తాం
….
దేశం ఒక నిర్ణయానికి వచ్చింది
బీజేపీ వచ్చి ఎనిమిదేళ్లు గడిచింది
బీజేపీ ఒక్క కొత్త ఫ్యాక్టరీ కూడా కట్టలేదు
బీజేపీ ప్రజలకు చేసింది ఏమి లేదని తెలిసింది
also read;-డ్యాన్స్ చేసిన ఖమ్మం పోలీస్ కమీషనర్
యూపీలో బీజేపీ బలం తగ్గుతుందని ముందే చెప్పాం
సీట్ల సంఖ్య.. ఓట్ల శాతం చాలా తగ్గింది
పంజాబ్ లో బీజేపీని తరిమికొట్టారు
ఉత్తరాఖండ్ లో కూడా బీజేపీ సీట్లు తగ్గాయి
….
సోషల్ మీడియా దుష్ప్రచారం చేస్తున్నారు
ఓట్ల కోసం కొత్త నాటకానికి తెరతీశారు
సెలవులిచ్చి మరి ఉద్యోగులను కశ్మీర్ ఫైల్స్ ను చూడమని చెప్పడం ఏంటి..?
దేశానికి కావాల్సింది కశ్మీర్ ఫైల్స్ కాదు ఫార్మర్ ఫైల్స్ ..డెవలప్ మెంట్ ఫైల్స్

కరోనా కట్టడీలో బీజేపీ ఘోరంగా విఫలమైంది
అఖరికి పవిత్రమైన గంగా నదిలో శవాలు తేలాయి
వలసకూలీలకు ప్రత్యేక రైళ్లు వేసి ముక్కుపిండి మరి ఛార్జీలు వసూలు చేసిన అసమర్థ ప్రభుత్వం బీజేపీ

దేశం ఏటువైపు పోతుంది
విభజన రాజకీయాలు చేస్తూ,విద్వేషాలు రెచ్చగొట్టి మరి బీజేపీ రాజకీయ పబ్బం గడుపుతుంది
also read;-అప్పుడు ధోనీ వికెట్‌ తీసా.. ఇపుడు విరాట్‌ కోసం చూస్తున్నా
రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు తీర్పు అమలు కావడం లేదు
ప్రత్యేక పరిస్థితుల్లో 50%కి పెంచుకోమని చెప్పిన సుప్రీం కోర్టు తీర్పు అమలు కావడం లేదు
ఎస్సీ వర్గీకరణకు అతిగతి లేదు

విభజన రాజకీయాలు చేస్తే దేశం పరిస్థితి ఏంటి..?
ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మే పరిస్థితి వచ్చింది
దేశం బాగుపడాలంటే బీజేపీ పోవాలి
ప్రజలను ఉద్వేగాలకు గురి చేస్తున్నారు
కశ్మీర్ ఫైల్స్ ఫిలాసఫీని తిప్పికొట్టాలి
….
బీజేపీ చెప్పినవి ఏవి చేయలేదు
దేశంలో నిరుద్యోగ రేటు భారీగా పెరిగింది
దేశంలో 15లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి
వాటిని వెంటనే భర్తీ చేయాలి
2కోట్ల ఉద్యోగాల హామీ ఏమైంది
….
దేశంలో అందరికి రాజ్యాంగ హక్కులున్నాయి
ఒక్క రైతాంగానికే లేవు
రైతులకు కూడా రాజ్యాంగ పర హక్కులు రావాలి
అందుకు మేము ముందు ఉండి పోరాటాలు చేస్తాం