Telugu News

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

- నాలుగేళ్లలో రైతులకు 50వేల కోట్లు

0

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

– నాలుగేళ్లలో రైతులకు 50వేల కోట్లు

– ఆదర్శనీయుడు, రైతులకు ఆత్మ బంధువు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షిరాభిషేకం

– జిల్లా రైతుబంధు అధ్యక్షులు పల్లా బుచ్చయ్య

 (కన్నాయిగూడెం విజయం న్యూస్);-

ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో రైతు శ్రేయస్సు, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని భూపాలపల్లి-ములుగు జిల్లాల రైతు బంధు అధ్యక్షులు పల్లా బుచ్చయ్య తెలిపారు. మంగళవారం మండలంలోని మిర్చి రైతుల కల్లాల దగ్గర నిర్వహించిన రైతు బందు సంబరాలలో భాగంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి పల్లా బుచ్చయ్య క్షిరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రానికి సాధ్యం కానీవి తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిలిచారని అన్నారు. నాలుగేళ్ళ లోనే 50వేల కోట్ల రూపాయలను రైతులకు పెట్టుబడి సాయంగా అందించిన ఏకైక ముఖ్యమంత్రి గా సీఎం కేసీఆర్ చరిత్ర పూటాల్లో నిలిచిపోతారని పేర్కొన్నారు.

also read ;-పినపాక సీటు ఎవరికి..?

తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నడిపిస్తూ బంగారు తెలంగాణ నిర్మాణానికి టీఆఆర్ఎస్ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టి అధ్యక్షుడు సుబ్బుల సమ్మయ్య, ప్రధానకార్యదర్శి పూజారి సత్యనారాయణ, చిలుముల రాంబాబు, మఠం వెంకటేష్, సీనియర్ నాయకులు కావిరి చిన్నికృష్ణ, తడకల మధుకర్, గ్రామాధ్యక్షులు చింతకుట్ల వెంకటయ్య, వాసంపల్లి రాంబాబు, గడ్డం నరేందర్, నామని తిరుపతి, పొందేం శోభన్ బాబు, కావిరి సుధాకర్, మేడారం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ పొండెం శోభన్, సర్పంచులు దుర్గం నారాయణ, ఆలెం ప్రభాకర్, నాయకులు కుందారపు నాగమల్లయ్య, మంచాల లక్ష్మినారాయణ, చిదరి సుమన్, పూజారి శ్రీనివాస్, పూజరి వెంకన్న, రైతు బందు సమితి గ్రామ కోఆర్డినేటర్లు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.