Telugu News

అకాల వర్షానికి నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: కాంగ్రెస్

తడిసిన, కిందపడిన పంటలను పరిశీలించిన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, కాంగ్రెస్ నేతలు

0

అకాల వర్షానికి నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: కాంగ్రెస్

== తడిసిన, కిందపడిన పంటలను పరిశీలించిన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, కాంగ్రెస్ నేతలు

(ముదిగొండ/ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

అకాల వర్షానికి నష్టపోయిన రైతులను ప్రభుత్వం అదుకోవాలని, ప్రతి ఎకరాకు రూ.50వేలను నష్టపరిహారంగా రైతులకు తక్షణమే అందించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గప్రసాద్ తెలిపారు. సీఎల్పీ లీడర్ మల్లు భట్టివిక్రమార్క ఆదేశానుసారం ముదిగొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు  కొమ్మినేని రమేష్ బాబు,మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు వల్లూరి భద్రారెడ్డి ఆధ్వర్యంలో  సోమవారం ముదిగొండ మండలంలోని చిరుమర్రి, మల్లన్నపాలెం, పమ్మి  గ్రామాలలో అకాలవర్షానికి దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, టీపిసిసి సభ్యులు పాలేరు నియోజకవర్గం నాయకులు  రాయల నాగేశ్వరావు పరిశీలించారు.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతు పంటకు గిట్టుబాటు ధర: సంభాని

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  ముదిగొండ మండలంలోని సుమరుగా 30వేల ఎకరాలో మొక్కజొన్న పంటలను సాగు చేయగా, సాగు చేసిన రైతాంగం లో 80% శాతం కౌలు రైతులే ఉన్నారని, కౌలు రైతుకు బ్యాంకు నుండి రుణ  సదుపాయం కానీ,రైతు బంధు సహాయం కానీవిత్తనాలు సబ్సిడీ గాని లేకపోవడం వల్ల రైతులు అప్పులు తీసుకొచ్చి పంటలను సాగు చేశారని అన్నారు.  ఎక్కువగా కౌలు రైతులు నష్ట పొయ్యారని, ఆ రైతులను తక్షణమే ఆదుకునే విషయంలో ప్రభుత్వం చోరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా మొత్తం ప్రతి పక్ష పార్టీ అయిన కాంగ్రెస్ రైతుల పక్షాన క్రింద పడిపోయిన మొక్కజొన్న పైరు ను పొలాలను పరిశీలించి రెండు రోజులు అయినా  గాని జిల్లాలో ఉన్న మంత్రి కానీ,అధికార పార్టీకి సంబంధించిన నాయకులు గానీఅదికారులు గాని ,పొలాల్లోకి వెళ్లి పరిశీలించకపోవడం  పట్టించుకోకపోవడం చాలా బాధాకర విషయమన్నారు. వ్యవసాయ  రెవిన్యూ అధికార యంత్రాంగం తక్షణమే వచ్చి మొక్క జొన్న పైరును పరిశీలించి రైతులకు నష్ట పరిహారంగా ఇన్పుట్ సబ్సిడీ  అందించాలని   డిమాండ్ చేశారు. మొక్కజొన్న రైతులను మంత్రి పరిశీలించి రైతులకు నష్టపరిహారంగా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఇప్పించాలని కౌలు రైతులు డిమాండ్ చేస్తున్నారు.  వర్షం కురిసిన అకాల వర్షంతో మండలంలో సుమారు నాలుగు నుంచి 8000 ఎకరాలు నేలమట్టమయ్యాయి. దీనివల్ల పంట చేసినా రైతాంగము కౌలు రైతలకు ఎకరంకు రూ.30వేలు నష్టం జరిగిందన్నారు. కావున ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాల దృష్ట్యా నష్టపోయిన రైతాంగానికి  ఎకరానికి మొక్కజొన్న పంటకు రూ.40 వేలు, కౌలు రైతులకి రూ.50 వేలు ఎకరానికి ఇన్పుట్ సబ్సిడీ మంజూరు చెయ్యాలని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: అధికార అహంకారంతో ఊగిపోతున్న బిజెపి:రాయల

 గతంలో కాంగ్రెస్ పార్టీ  ప్రకృతి  వైపరీత్యాల వల్ల  నష్టపోయిన రైతాంగాన్ని  కాపాడుకునేదని, ఇప్పుడు కేంద్రంలో ఉన్న  బిజెపి ప్రభుత్వం ,రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం  నష్టపోయిన రైతంగాన్ని ఎందుకు కాపాడటం లేదన్నారు.ఈ రెండు పార్టీలు  అధికారం కు వచ్చిన తర్వాత  గతంలో రాసిన  పరిహారాన్ని రైతులకు ఇప్పటివరకు ఇవ్వలేదు. పెద్ద ఎత్తున రైతుల పక్షాన  నిరసనలు ,ధర్నాలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ పార్టీ, రాబోయే రోజుల్లో మరిన్ని పోరాటాలు చేసి రైతులను ఆదుకునే వరకు పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో  కార్యక్రమంలో  తాటికొండ రమేష్,  సామినేని శంబయ్య,పసుపులేటి దేవేంద్రం, పందిరి అంజయ్య, బుల్లెట్ బాబు, బిచ్చాల బిక్షం, చెరుకుపల్లి రాంబాబు, ధర్మానాయక్, పిల్లుట్ల రాఘవ, జెట్టి వినోద్, చిలకల రామకృష్ణ, మండేపూడి ఆనందరావు, కోయ ధనమూర్తి, జంపాల కోటేశ్వరరావు, షేక్ నాగుల్ మీరా, మీగడ నాగేశ్వరరావు, రాయబారపు శంకర్, చిన్న పంగు శివరాయబారపు వీరబాబు,  తాళ్ల శ్రీను, ఉమారావు, బిచ్చాల అనంత రాములు  తదితరులు పాల్గొన్నారు..