Telugu News

రైతులకు అండగా మేముంటాం : అన్వేష్ రెడ్డి

== బీజేపీ, టీఆర్ఎస్ దొందుదొందే

0

రైతులకు అండగా మేముంటాం : అన్వేష్ రెడ్డి
== బీజేపీ, టీఆర్ఎస్ దొందుదొందే
== కావాలనే రైతులను నిలువునా మోసం చేస్తన్నరు
== రైతు రాజ్యం రావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి
== వేపకుంట్ల గ్రామంలో ఘనంగా రచ్చబండ కార్యక్రమం
== తరలివచ్చిన రైతన్నలు..
(రఘునాథపాలెం,ఖమ్మం-విజయంన్యూస్)
తెలంగాణ రాష్ట్రంలో రైతులను ఆదుకునే ప్రభుత్వాలు లేవని, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు కూడబలుకొని యావత్తు రైతాంగాన్నే నిలువున మోసం చేస్తున్నారని, అందుకే నష్టపోయిన రైతులకు అండగా మేముంటామని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు సంకేటా అన్వేష్ రెడ్డి భరోసానిచ్చారు. తెలంగాణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్ల తెలంగాణ రైతాంగం దుర్భర పరిస్థితి ఎదుర్కొంటోందని అన్వేష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం రఘునాథపాలెం మండలం వేపకుంట్ల లో కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మొక్కా శేఖర్ ఆద్వర్యంలో ’రైతులతో రచ్చబండ‘ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి హాజరైయ్యారు. ఆయనకు గ్రామంలోని మహిళలు తిలకం దిద్ది, హారతులు పట్టి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో రైతులతో మాట్లాడారు. రైతుల అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు.

గత కాంగ్రెస్ పార్టీ హాయంలో ఏ నాడు రైతులను ఆ పంట వేసుకొండి, ఈ పంట వేసుకొండి అని చెప్పిన దాఖలాలు లేవని, రైతులకు పంటకు తగిన ధరలను అందించి, కష్టాల్లో రైతులను అదుకునేవారని, కానీ ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ పంట వేయండి, ఈ పంట వేయండి అంటూ రైతులు సాగు చేసే పంటలకు అంక్షలు పెడుతున్నారని ఆరోపించారు. మళ్లీ రైతు ప్రభుత్వం రావాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు స్వాతంత్య్రం వచ్చిన కాణ్ణించీ ఇంతవరకు ఏనాడూ ఇటువంటి దుర్భర పరిస్థితిని ఎదుర్కోలేదని, సరైన గిట్టుబాటు ధర లేక మిర్చి పంటకు తామర పురుగు పట్టి ఎకరానికి రెండు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన తోట కనీసం ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయిందని, ఎక్కడ పొసిన దాన్యం అక్కడే ఉంటుందని, ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయలేక రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసిందని, ఆత్మహత్యలు చేసుకున్నకుటుంబాలకు ఇంతవరకు ఎలాంటి నష్ట పరిహారం అందించలేదని ఆరోపించారు. తామర పురుగు తో నష్టపోయిన మిర్చి రైతులకు ఎకరానికి లక్ష రూపాయల చొప్పున ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేశారు. రైతాంగాన్ని అప్పులపాలు నుండి రక్షించడం కోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని కోరారు.

ఇది కూడా చదవండి :- రైతుల ఖాతాలో సమఅవుతున్న రైతు బంధు నిధులు

రాష్ట్రంలో ప్రజాస్వామ్య రాజ్యంలో లేదని అంతా పోలీస్ రాజ్యం నడుస్తోందని రైతులు తమ సమస్యల కోసం పోరాడే హక్కు లేకుండా పోలీసులు నిర్బంధిస్తున్నారని విమ్మర్శించారు. ఇకనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమ పనులు చేపట్టి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రైతులు రైతు కూలీలు తమ సమస్యలను ఆయనకు విన్నవించుకున్నారు. రచ్చ బండ తర్వాత తామరపురుగుతో నష్టపోయిన మిర్చి తోట లను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఖమ్మం నగర అధ్యక్షుడు మహ్మద్ జావిద్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు మొక్కల శేఖర్ గౌడ్, ఖమ్మం కార్పోరేటర్ మలీదు వెంకటేశ్వర్లు, వాంకుడోతు దీపక్ నాయక్, బూక్యా బాలాజీనాయక్, బీసీసెల్ జిల్లా అధ్యక్షుడు పుచ్చకాయల వీరభద్రం, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు బొడ్డు బొందయ్య, మహిళ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రామసహాయం మాదవిరెడ్డి, జిల్లా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు నాగిరెడ్డి రమేష్ రెడ్డి, మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు వేమలి రమేష్, వడ్డే నారాయణ, చల్లగుండ్ల శ్రీనివాస్రావు, బోడ తావూరి నాయక్, కోటేరు నర్సిరెడ్డి, మూడు ముంతల గంగరాజు, బచ్చలకూర నాగరాజు చింతకాని మండలం కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు కొప్పుల గోవిందరావు, జెర్రిపోతుల అంజనీ, కిసాన్ కాంగ్రెస్ నాయకులు గ్రామ రైతులు

also read :-టీపిటిఎఫ్ కార్యకర్తల అక్రమ అరెస్టులను ఖండించిన టిపిటిఎఫ్ ఖమ్మం జిల్లా కమిటీ