Telugu News

రోడ్డు నిధుల మళ్లింపు పై ఆగ్రహించిన రైతులు

== తమకు అన్యాయం చేస్తున్నారని సర్పంచ్ ను నిలదీసిన రైతులు

0
రోడ్డు నిధుల మళ్లింపు పై ఆగ్రహించిన రైతులు
== తమకు అన్యాయం చేస్తున్నారని సర్పంచ్ ను నిలదీసిన రైతులు
బూర్గంపహాడ్, జనవరి 24(విజయం న్యూస్ )
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామాల్లో పెద్ద డొంక రోడ్డు కొరకు సమావేశమైన రైతులు పెద్ద డొంక కు మంజూరైన నిధులను పెద్ద డొంక కి ఖర్చు చేయాలని గ్రామంలో  రైతులు డిమాండ్ చేశారు.ఈ డొంక నుంచి దాదాపు 400 మంది రైతులు నడిచేయిదారిని పొయ్యాలి అని ప్రజాప్రతినిధుల్ని డిమాండ్ చేశారు ఈ రోడ్డు పొడవునా దాదాపు 2800 వందల ఎకరాలు సాగు భూమి ఉంది ఈ రోడ్డున చిన్నా సన్నకారు  రైతులు సాగు చేసుకుంటున్నారు వర్షాకాలంలో ఈ ప్రాంత రైతులు మొత్తం ఈ రోడ్డు మీద నడవలేని పరిస్థితి ఏర్పడింది వర్షాకాలంలో మోకాళ్ళ లోతు బురద పోవాలంటే పరిస్థితి చాలా దారుణంగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కావున  మా రోడ్డు కు మంజూరైన నిధులను మా రోడ్డుకె ఖర్చు చేయగలరని రైతులు కోరుతున్నారు