Telugu News

దేశానికి రైతు వెన్నుముక.: అంకిరెడ్డి.

రైతు కళ్ళల్లో ఆనందమే టిఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్యం

0

దేశానికి రైతు వెన్నుముక.: అంకిరెడ్డి
రైతు కళ్ళల్లో ఆనందమే టిఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్యం
జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి
(చండ్రుగొండ-విజయం న్యూస్) :-
దేశానికి రైతు వెన్నుముక అని జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి అన్నారు. బుధవారం చండ్రుగొండ మండలం లో రైతు బంధు సంబరాల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఏ రాష్ట్రంలో చేయని కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అమలు జరుగుతున్నాయి అన్నారు.

also read;-షార్ట్ సర్క్యూట్తో యువ రైతు మృతి.

అదేవిధంగా ప్రతి రైతు కళ్లల్లో ఆనందం చూడాలని కెసిఆర్ రైతుల కోసం రైతుబంధు పథకం ప్రవేశపెట్టారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి నవీన్ బాబు, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు దా రా బాబు, ప్రధాన కార్యదర్శి ఉత్ప తల ఏడుకొండలు, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ లింగయ్య, సీనియర్ నాయకులు మాలోత్ భోజ నాయక్, మేడ మోహన్ రావు, సారేపల్లి శేఖర్, ఉన్నం నాగరాజు, సొర వెంకటేశ్వరరావు, గూగులోత్ రమేష్, బాబూలాల్ తదితరులు పాల్గొన్నారు.