Telugu News

విపక్షాలకు వద్దిరాజు కౌంటర్ ఎటాక్

ధరణిపై కాంగ్రెస్ సహా విపక్షాలది రాజకీయ రాద్దాంతం అన్న ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

0

ధరణి లో రైతులకు మేలు జరిగింది: వద్దిరాజు

✦  ధరణి తప్పైతే మీకు రైతుబంధు, రైతు భీమా ఎలా అందుతుంది..?

✦ తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు, నాయకులు తీసుకుంటున్నారా లేదా ??

✦ ధరణిపై కాంగ్రెస్ సహా విపక్షాలది రాజకీయ రాద్దాంతం అన్న ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

రఘునాధపాలెం, మే, 10: (ఖమ్మం)

రెవెన్యూ వ్యవస్థలో పారదర్శక, సులభతరం సేవల కోసం రూపొందించిన ధరణి పోర్టల్ పై కాంగ్రెస్ సహా విపక్ష పార్టీల నేతలు చేస్తున్న విమర్శలు.. రాజకీయ విమర్శలు తప్పితే మరొకటి కాదని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో మంత్రులు మహమూద్ అలీ, పువ్వాడ అజయ్ కుమార్ లతో కలిసి నూతనంగా నిర్మించిన తహశీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ భవనాలను   ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సుపరిపాలనా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం నిర్వహించారు. నూతన భవనాల ప్రారంభోత్సవ అనంతరం అక్కడ  ఏర్పాటు చేసిన బహిరంగ సభలో విపక్షాలపై వద్దిరాజు రవిచంద్ర విరుచుకుపడ్డారు.

ఇది కూడా చదవండి: జర్నలిస్ట్ కుటుంబానికి ఎంపీ వద్దిరాజు చేయూత

ధరణితో సమస్యలు ఉన్నాయని విమర్శలు చేస్తున్న ప్రతిపక్ష పార్టీల నాయకులు.. తమ భూములకు పాస్ పుస్తకాలు వచ్చాయి.? రాలేదా.? అని ఆయన ప్రశ్నించారు. ధరణిలో మీ భూములు భద్రంగా ఉన్నాయా.? లేదా.? అని వద్దిరాజు విపక్ష నేతలను సూటిగా ప్రశ్నించారు. మీ భూములు భద్రంగా ఉండి.. మీ పాస్ పుస్తకాలు మీ చేతిలో ఉండి..  ఏటా రైతుబంధు డబ్బులు మీ ఖాతాలో పడుతున్నప్పుడు ధరణిని రద్దు చేయాలని అనడంలో అర్థం ఏమిటని రవిచంద్ర ప్రశ్నించారు. ప్రతిపక్షాలది రాజకీయ విమర్శ తప్ప.. మరొకటి కాదన్న విషయాన్ని ప్రజలు గ్రహించాలని ఎంపీ కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్  ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాల్లో అన్ని పార్టీల కార్యకర్తలు లబ్ధి పొందుతున్నారని ఎంపీ గుర్తు చేశారు. ఈ పార్టీ , ఆ పార్టీ అని ఏమైనా తేడాలు ఉన్నాయా?  అని ఆయన ప్రతిపక్షాలను ప్రశ్నించారు. ఎక్కడా సమస్య లేనప్పుడు.. ఏ పార్టీ కార్యకర్తల పట్ల వివక్ష లేనప్పుడు.. మరి విమర్శలు చేయడం రాజకీయం కాక మరేమవుతుందో అర్థం చేసుకోవాలని ప్రజలను కోరారు. ఇలాంటి రాజకీయ పార్టీలు మనకు అవసరమా..? లేదా..? అని తేల్చుకోవాలని కూడా సూచించారు. ప్రజలకు మెరుగైన పాలన అందిస్తూ.. అభివృద్ధిలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళుతూ.. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను ముచ్చటగా మూడో సారి ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. ఈ సభలో ఎమ్మెల్సీ తాతా మధు, జిల్లా కలెక్టర్ వి. పి. గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్, విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, మేయర్ పునుకొల్లు నీరజ, జెడ్పీటీసీ సభ్యురాలు మాలోత్ ప్రియాంక, ఎంపీపీ భూక్యా గౌరీ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: సీఎంను కలిసిన ఎంపీ రవిచంద్ర